News' బాలయ్య భ‌గ‌వంత్ కేస‌రి ' రోల్‌కు ' ఎన్టీఆర్ దేవ‌ర...

‘ బాలయ్య భ‌గ‌వంత్ కేస‌రి ‘ రోల్‌కు ‘ ఎన్టీఆర్ దేవ‌ర ‘ సెకండ్ క్యారెక్ట‌ర్‌కు ఉన్న లింక్ ఇదే..!

టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ది డ్యూయల్ రోల్ అట‌. తండ్రి, కొడుకులు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా తండ్రిగా ఎన్టీఆర్ గెటప్ ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తండ్రి పాత్ర ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో రివీల్ అవుతుందని.. 60 ఏళ్ల పెద్దాయనగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎన్టీఆర్ ఓల్డ్ క్యారెక్టర్ సరసన ఓ ప్రముఖ హీరోయిన్ జంటగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతైనా కొరటాల దేవర కథ కోసం చాలా నెలలు క‌స‌ర‌త్తులు చేశాడు.

కథలో అదిరిపోయే యాక్షన్ – ఫ్లాష్ బ్యాక్ – సెంటిమెంట్ ఎలిమెంట్స్ బ‌లంగా రాసినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాలో కూడా 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండే తండ్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో కనిపించబోతుందని.. ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అటు బాబాయ్ బాల‌య్య‌.. ఇటు అబ్బాయ్‌ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకేసారి 50 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన‌ పాత్రలలో నటిస్తూ తమ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news