News' భోళాశంక‌ర్ ' ఎఫెక్ట్‌... ఆ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చిన చిరు......

‘ భోళాశంక‌ర్ ‘ ఎఫెక్ట్‌… ఆ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చిన చిరు… సినిమా క్యాన్సిల్‌…!

మన టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ అవటం ఒక ఎత్తు అయితే.. చిరంజీవి అభిమానులను కూడా మెప్పించలేదు. చివరికి చిరు అభిమానులు కూడా ఈ సినిమాతో పాటు చిరంజీవి ఎంచుకునే కథలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

చిరంజీవి నటించిన గత ఐదు సినిమాలలో ఒక వాల్తేరు వీరయ్య సినిమా మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు డిజాస్టర్లు అవడంతో పాటు నిర్మాతలకు.. సినిమా కొన్న వారికి భారీ నష్టాలు మిగిల్చాయి. సైరా – ఆచార్య – గాడ్ ఫాదర్ తాజాగా భోళాశంకర్ ఈ నాలుగు సినిమాలు నష్టాలు మిగల్చగా ఒక వాల్తేరు వీర‌య్య‌ సినిమాకు మాత్రమే లాభాలు వచ్చాయి.

అందులోను చిరు రీయంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 – గాడ్ ఫాదర్ – భోళా శంకర్ ఇలా రీమేక్ సినిమాలు ఎక్కువగా చేయటం కూడా అభిమానులకు నచ్చటం లేదు. తాజాగా భోళాశంకర్ ఎఫెక్ట్‌తో చిరంజీవి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి లైనఫ్‌లో మలయాళ హిట్ సినిమా బ్రో డాడీ రీమేక్ కూడా ఉంది. కుర‌సాల కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల‌ సుష్మిత ఈ సినిమాకు నిర్మాత.

అయితే ఇప్పుడు తన సినిమాలపై వస్తున్న విమర్శలు నేపథ్యంలో చిరంజీవి ఈ సినిమాను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ చేసే రెండు సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలు కానున్నట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి ఇప్పట్లో రీమేక్‌ సినిమాలు పక్కన పెట్టాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బ్రో డాడీ రీమేక్ కు రెడీ అవుతున్న కురసాల కళ్యాణ కృష్ణకు చిరు మార్క్ షాక్ అయితే తప్పేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news