Moviesఆమె అంటే చచ్చేంత ఇష్టం.. కానీ ఆ పని మాత్రం చేయని...

ఆమె అంటే చచ్చేంత ఇష్టం.. కానీ ఆ పని మాత్రం చేయని రాజమౌళి..? జక్కన్న రూటే వేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా.. దర్శకధీరుడు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. అప్పటివరకు కేవలం తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళిని ..బాహుబలి సినిమా అంతటి స్థానానికి తీసుకెళ్లింది . బాహుబలి తో వచ్చిన క్రేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ప్లస్సుగా మారింది . ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది.

ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది జనాలకు ఇష్టమైన రాజమౌళికి ఓ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టమట . ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్. మొదటి నుంచి ట్రెడిషనల్ బ్యూటీస్ ని లైక్ చేసే రాజమౌళికి మొదటిగా సావిత్రి గారు అంటే చాలా ఇష్టం ఉండేదట . ఆ తర్వాత సౌందర్య గారు ఆ స్థానాన్ని భర్తీ చేసుకున్నారు .

అయితే నేటి కాలం హీరోయిన్స్ లో నిత్యామీనన్ అంటే చాలా చాలా ఇష్టమట . అందుకే ఆమె సినిమాలు మిస్ కాకుండా చూస్తూ ఉంటాడట . దానికి కారణం ఆయన నాచురల్ యాక్టింగ్ ఇష్టపడడమే . అయితే ఎంత ఇష్టం ఉన్నా కానీ నిత్యామీనన్ ని తన సినిమాలో పెట్టుకోను అంటూ తెగేసి చెప్పుకు వచ్చేసాడట రాజమౌళి. దానికి కారణం అమ్మడు హైట్. ఆమె పొట్టిగా ఉండడంతో రాజమౌళి తెరకెక్కించే సినిమాలు భారీ భారీగా ఉండడంతో భారీ కటౌట్లు ఉన్న హీరోలను చూస్ చేసుకోవడంతో వాళ్లకు నిత్యామీనన్ సూట్ కాదని ఆమెను సినిమాలో హీరోయిన్గా తీసుకోవడం కష్టం అని చెప్పుకొచ్చారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news