Moviesగూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ K (కల్కి 2898AD)..బాహుబలి కి...

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ K (కల్కి 2898AD)..బాహుబలి కి మించిన హిట్ పక్కా(వీడియో)..!!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ప్రాజెక్టుకె. బాహుబలి సినిమా తర్వాత సరైన హిట్ లేక అల్లాడిపోతున్న ప్రభాస్ ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . ఈ చిత్రంలో అమితాబచ్చన్ – దీపికా పదుకొనే – దిశా పటాన్ని ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉండగా కమలహాసన్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కాగా కొన్ని గంటల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని.. ఫస్ట్ గ్లింప్స్ ను ను రివిల్ చేశారు మేకర్స్.

అయితే దానికి ఆన్సర్ దొరికేసింది కే ..అంటే కల్కి అని అర్ధం. తాజాగా చిత్ర యూనిట్ అమెరికాలో కెమిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్టుకె అసలు పేరుని వెల్లడించారు. గ్ల్మిప్స్ విడుదల చేస్తూ ప్రాజెక్టుకే మీనింగ్ కల్కి అనే పేరు ఖరారు చేస్తూ కల్కి 2898 ఏడిగా నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లిమొస్ అదిరిపోయింది . అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బాహుబలి తర్వాత సరైన హిట్ ప్రభాస్ కి ఇచ్చేది కల్కి సినిమా అంటూ తెలిసిపోయింది.

భవిష్యత్తులో జరగబోయేది ఇందులో చూపించేశారు . అంటే 825 ఏళ్ల తర్వాత జరిగే కథగా ఈ సినిమా సాగుతుంది . ఒక్కొక్క స్క్రీన్ లో నాగ్ అశ్విన కష్టం క్లియర్ గా కనబడుతుంది . ఇందులో సూపర్ పవర్ కలిగిన ప్రత్యర్థుల చేతిలో మనుషులను బంధించబడతారు. అనేక ఆగడాలకు గురవుతూ ఉంటారు . వారికి సూపర్ హీరో ప్రభాస్ ఎలా చెక్ పెట్టారు అన్నది సినిమా కథ . ఇందులో ప్రపంచాన్ని చీకటి అధీనంలోకి తీసుకున్నప్పుడు ఒక శక్తి ఎదుగుతుంది. అప్పుడు అంతం ప్రారంభమవుతుంది అనే క్యాప్షన్‌ అదిరిపోయేలా ఉంది. ఇదంతా వేరే గ్రహంపై జరుగుతున్నట్టుగా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్‌గా ఈ గ్లింప్స్ సాగింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటనేది ఇందులో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. అదొక మిషన్‌గా తెలుస్తుంది. దాన్ని ప్రత్యర్థులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మరికొత్త మైలురాయిని అందుకునేలా ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా glimpse వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news