Moviesవామ్మో.. హీరోయిన్ జెనిలియా కూడా విడాకులు తీసుకోబోతుందా..? సేమ్ సమంత బ్రతుకేనా..?

వామ్మో.. హీరోయిన్ జెనిలియా కూడా విడాకులు తీసుకోబోతుందా..? సేమ్ సమంత బ్రతుకేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. రోజుకో ముద్దుగుమ్మైనా సరే విడాకులు ప్రకటిస్తూ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంది. పైగా మరీ ముఖ్యంగా స్టార్ స్టేటస్ వచ్చాక హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి విడిపోతూ ఉండడం ఇప్పుడు అభిమానులకి చాలా బాధగా అనిపిస్తుంది . అదే లిస్టులోకి యాడ్ అయిపోతోంది అందాల ముద్దుగుమ్మ జెనీలియా అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . బొమ్మరిల్లు సినిమా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హహ హాసిని. హీరో కంటే హీరోయిన్ ఈ సినిమా ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది .ఈ సినిమా హిట్ అవ్వడానికి సిద్ధార్ధ్ ఎంత కారణమో.. అంతకు డబుల్ రేంజ్ లో హాసిని పాత్ర చేసిన జెనీలియా కూడా కారణం అంటూ జనాలు చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ టైంలోనే రితేష్ దేశముఖ్ తీ ప్రేమలో పడి వెంటనే పెళ్లి కూడా చేసుకుంది. రితేష్ ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ సీఎం కొడుకే . ఇక జెనీలియా సీఎం ఇంటికి కోడలుగా వెళ్లడంతో సినిమాలకు బై బై చెప్పేసింది . ఇద్దరు పిల్లలు పుట్టాక మళ్ళీ సినిమాలోకి రిఎంట్రీ ఇచ్చింది . ప్రజెంట్ జెనీలియా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మళ్ళీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది.

ఈ క్రమంలోనే సడన్గా తెరపైకి జెనీలియా విడాకులు మేటర్ వచ్చింది . అసలు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ..జెనీలియా విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ జెనీలియా తన భర్తతో ఉన్న ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . వీరిద్దరి మధ్య అన్యోన్యత ను చూసి ఎవరైనా సరే ఇది ఫేక్ అనుకుంటారు. కానీ బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జెనీలియా రితేష్ దేశముఖ్ ల మధ్య వార్ జరుగుతుందని .. వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని త్వరలోనే జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు .

దానికి మెయిన్ కారణం జెనీలియా వేసే చిట్టి పొట్టి బట్టలు అంటూ.. ఆమె సినిమా ఇండస్ట్రీలో చూస్ చేసుకునే కాన్సెప్ట్ అంటూ తెలుస్తుంది . జెనీలియా గ్లామర్స్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే రితీష్ హోమ్లీ పాత్రలకు సైన్ చేయమంటున్నారట . దీంతో జెనీలియా కూడా సమంత లాగే తన ఆశలని అలాగే వదులుకోవాలా..? అంటూ ప్రతిరోజు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుందట . ఈ క్రమంలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం రూపందుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news