Moviesవామ్మో.. ఈ వైష్ణవిని మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారే..? ఏకంగా ఆ...

వామ్మో.. ఈ వైష్ణవిని మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారే..? ఏకంగా ఆ హీరోయిన్ తోనే పోల్చేసారుగా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారుమ్రోగిపోతుంది. ఆమె నటించిన సినిమా బేబీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా రికార్డులు నెలకొల్పింది. అంతేకాదు పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు లాభాలు తీసుకొచ్చి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది .

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ బేబీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . కాగా మొన్న జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా నిన్న జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారే గెస్ట్ గా వచ్చి వైష్ణవి చైతన్యను ఓ రేంజ్ లో పొగిడేసారు . అంతేకాదు ఆమెకు సహజ నటి జయసుధ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు .

దీంతో సోషల్ మీడియాలో మరీ ఎక్కువగా వైష్ణవి చైతన్యను పొగడేస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి- అల్లు అర్జున్ చెప్పింది నిజమే ఆమె బాగా నటించింది ఆమె వల్లే సినిమా హిట్ అయింది . కానీ ఈమె లాగే గతంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా నటించారు. అయితే అలాంటి సినిమాలను ఎందుకు ప్రమోట్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు వైష్ణవి చైతన్యను మరీ ఓవర్గా పొగిడేస్తున్నారనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news