Movies"దేవర" సినిమా లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయిపోయిందోచ్.. గూస్ బంప్స్...

“దేవర” సినిమా లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయిపోయిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న (వీడియో)..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటి సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తారక్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో జనాల్లో హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్గా జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ .

అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉందని ఆ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అందాల ముద్దుగుమ్మ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇద్దరిలో ఒకరిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్న వార్తలు ఎప్పటినుంచో వినిపించాయి . అయితే ఫైనల్లీ దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .

రేపు మాపో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో తారక్ , మృణాల్ ఠాకూర్ పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. అంతేకాదు తారక్ పక్కన మృణాల్ ఠాకూర్ చాలా బాగుంటుందని చూడడానికి చక్కగా ఉంటుంది అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . చూడాలి మరి తెర పై వీరిద్దరి కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో..?

కాగా రీసెంట్ గానే ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సినిమా రిలీజ్ కి 250 రోజులు మాత్రమే ఉంది అంటూ భారీ పవర్ ఫుల్ డైల్స్స్గ్స్ తో కొరటాల వాయిస్ ఓవర్ తో ఓ స్పెషల్ వీడియో ని రిలీజ్ చేశారు మేకర్స్.!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news