Movies' గుంటూరు కారం ' లో ఆమె కోసం మ‌హేష్ పెద్ద...

‘ గుంటూరు కారం ‘ లో ఆమె కోసం మ‌హేష్ పెద్ద త్యాగం.. సెంటిమెంట్ పిండేశాడా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శ‌ర‌వేగంగా జరుగుతుంది. మహేష్ బాబుకి జోడిగా ముందుగా పూజ హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారు. పూజ డేట్లు సర్దుబాటు చేయలేక చేతులు ఎత్తడంతో మెయిన్ హీరోయిన్ గా శ్రీలలను.. రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రిని తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిన్ మీనాక్షి చౌదరి కోసం పెద్ద త్యాగం చేస్తాడని.. ఇది సెంటిమెంట్ పిండేసేలా ఉంటుందని తెలుస్తోంది. మీనాక్షి చౌదిరి పాత్ర సెకండాఫ్ లో వస్తుంది అని.. సినిమాలో ప్రధానంగా ఆమె రోల్‌ ఉండబోతుందని అంటున్నారు. శ్రీలీల పాత్ర గ్లామర్ పరంగా హైలైట్ అవుతుందని.. కథ అంతా మీనాక్షి చౌదరి పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

మహేష్ బాబు .. విలన్ల మధ్య జరిగే వార్‌ మీనాక్షి చౌదరి కోసమే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి మీద త్రివిక్రమ్ పలు సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ సినిమా క‌థ అంతా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలోనడుస్తోంది. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని రెడీ చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రెడీ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోన్న గుంటూరు కారం మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ ఈ సినిమా కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news