Moviesమాస్‌కా దాస్ ఊర‌మాస్‌.. నేహ ఏం అందం… “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”...

మాస్‌కా దాస్ ఊర‌మాస్‌.. నేహ ఏం అందం… “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఫస్ట్ గ్లింప్స్ ( వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ దాస్ కా ధ‌మ్కీ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిజెటిల్లు సినిమాతో తెలుగు కుర్రకారును తన అందచందాలతో ఊపేసిన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలోనే ఈరోజు ఈ సినిమా టైటిల్ రివిల్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో విశ్వక్సేన్ ఊరమాస్ క్యారెక్టర్ ఎంట్రీ అదిరిపోయింది. అటు హీరోయిన్ నేహాశెట్టి చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా విశ్వక్‌ను గతంలో ఎప్పుడు చూడని పాత్రలో చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో నాజర్ – సాయికుమార్ – గోపరాజు రమణ కీలకపాత్రలలో నటించారు.

కోలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ యవన్శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ను వేరే లెవెల్ లో నిలిపింది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలు సంయుక్తంగా నిర్మించాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news