Moviesసితారకి ఆ బుద్ధులు ఆ సైడ్ నుంచే వచ్చాయా..? చిన్న వయసులోనే...

సితారకి ఆ బుద్ధులు ఆ సైడ్ నుంచే వచ్చాయా..? చిన్న వయసులోనే ఇలా ఎలా రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని పేరునే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా సరే సితార కి సంబంధించిన క్రేజీ క్రేజీ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి . దానంతటికీ కారణం రీసెంట్ గానే ఆమె కెరియర్ లో ఫస్ట్ టైం నటించిన జ్యూవెలరీ యాడ్ రిలీజ్ కావడం . ఈ యాడ్ లో సితార పాప ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉందో మనందరికీ తెలిసిందే . కాగా ఈ యాడ్ ని పదే పదే ఇంట్లోని ఆడవారి సైతం చూస్తున్నారు అంటే తన ట్రెడిషనల్ లుక్ తో సితార పాప ఎలా హోమ్లీ లేడీస్ ని ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

కాగా ఈరోజు సితార పాప పుట్టినరోజు ..ఈ క్రమంలోని తన తండ్రి మంచితనాన్ని దాటేసింది సితార పాప . ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సితార పేద పిల్లలకు సైకిల్ పంపిణీ చేసింది . ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద మనసు సితారకు ఎలా వచ్చింది అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. ఈ రోజు తన 11వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటుంది సితార. కాగా మొదటి నుంచి సేవ కార్యక్రమాలు అంటే ఎక్కువుగ ఐష్టపడే ఈ బ్యూటీ.. తన పుట్టినరోజు సందర్భంగా నిరుపేద బాలికలకు బహుమతులు అందజేసింది .

అందరికీ తమకు ఉపయోగపడే సైకిలను బహుమతిగా ఇచ్చింది. జనరల్ గా ఏ స్టార్ సెలబ్రిటి పిల్లలు అయినా బర్త డే అంటే జల్సాలు చేస్తారు . పార్టీలు ..పబ్బులు అంటూ రచ్చ రంబోలా చేస్తారు . అయితే సీతార మాత్రం తన తండ్రిలాగే పేద పిల్లలకు సహాయం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సీతార పేరుని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు స్పెషల్గా బర్తడే విషెస్ సైతం అందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news