Moviesబాక్స్ ఆఫిస్ రియల్ హీరో అనిపించిన బాలయ్య.. ఒక్క ధియేటర్ లో...

బాక్స్ ఆఫిస్ రియల్ హీరో అనిపించిన బాలయ్య.. ఒక్క ధియేటర్ లో “వీరసింహారెడ్డి” 200 రోజులు ..ఏ ఊరిలో అంటే..!!

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయాలి అన్న .. ఆ రికార్డులను బద్దలు కొట్టాలి అన్న నందమూరి హీరోల తర్వాతే మరి ఏ హీరో అయినా అని చెప్పక తప్పదు . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ అయిన రికార్డును చూస్తే ఆ రికార్డును క్రియేట్ చేసిన హీరోలు అందరూ నందమూరి హీరోలే కావడం గమనార్హం. స్వర్గీయ నందమూరి తారకరామారావు దగ్గర గారి నుంచి హీరో కళ్యాణ్ రామ్ వరకు ఇండస్ట్రీలో ఉండే నందమూరి హీరోలు ఎలాంటి క్రేజీ రికార్డు నెలకొల్పారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

తాజాగా మరో అలాంటి సరికొత్త రికార్డును క్రియేట్ చేసి సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసి పడేశాడు నందమూరి బాలకృష్ణ. అసలు ఇప్పుడు సినీ పోసిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లు పెట్టి సినిమా తీస్తున్న సరే పట్టుమంటూ పది రోజులు కూడా థియేటర్స్ లో ఆడడం లేదు. అలాంటి మూమెంట్లో కూడా నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా ఏకంగా 200 రోజులు ఒకే థియేటర్లో నిర్విరామంగా షోలు పడుతూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది . ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా బాలయ్య కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “వీరసింహారెడ్డి”.

మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు . ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే . కాగ ఫుల్ టు ఫుల్ మాస్ యాక్షన్ ఫామిలీ సెంటిమెంట్ సమపాలనలో కలగలిసిన ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చేసింది.

మరీ ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ సినిమా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించిన ఈ సినిమా రీసెంట్ గా మరో క్రేజే రికార్డును సైతం సొంతం చేసుకుంది . ఒకే థియేటర్లో ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకొని సంచలన రికార్డు నెలకొల్పింది. వీర సిమ్హా రెడ్డి సినిమా ఈ ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ ఏప్రిల్ 21తో వంద రోజులు పూర్తిచేసుకుంది . తాజాగా ఈ శుక్రవారంతో 200 రోజులు పూర్తి చేసుకొని కర్నూల్ ఆలూరి లోని ఎస్ ఎల్ ఎస్ ఎస్ థియేటర్లో మొత్తంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా కీలక మైలు రాయిని చేరుకుంది. దీంతో సోషల్ మీడియాలో వీరసింహారెడ్డి సినిమా హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . ఇది బాలయ్య రేంజ్ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news