Moviesరాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణం అదే.. తేల్చేసిన డాక్టర్లు.. ఫుడ్ లో...

రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణం అదే.. తేల్చేసిన డాక్టర్లు.. ఫుడ్ లో విషం కలిపారా.. ?

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . స్టార్ సెలబ్రెటీ మరణించారు అన్న విషాద ఛాయాల నుంచి కోలుకోక ముందే మరో స్టార్ సెలబ్రెటీ మరణిస్తూ ఉండడం సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నింపేస్తుంది . కాగ ఇప్పటికే ఎంతోమంది స్టార్ ప్రముఖులను పోగొట్టుకున్న సినీ ఇండస్ట్రీ రీసెంట్ గానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ ను పోగొట్టుకునింది .

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ 53 నిన్న సాయంత్రం ఐదు గంటలకు తుది శ్వాస విడిచారు . కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు . దానికి తోడు ఆయన విశ్రాంతి లేకుండా యూట్యూబ్ ఛానల్స్ కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కంటిన్యూగా తిరుగుతూ ఉండడంతో.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ తగిలింది . దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి రక్త విరోచనాలు అయ్యి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో చనిపోయినట్లు డాక్టర్స్ ధృవీకరించారు .

రాకేష్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు డాన్స్ కొరియోగ్రఫీ అందించారు . బుల్లితెరపై ఆట షో తో రాకేష్ మాస్టర్ కెరియర్ ప్రారంభించారు . ఆ తర్వాత ఆయన కెరియర్ గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిపోయింది మనకు బాగా తెలిసిందే. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్న రాకేష్ మాస్టర్ .. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వచ్చారు.

కాగా మరికొందరు రాకేష్ మాస్టర్ అభిమానులు ఆయనపై విషప్రయోగం చేశారని ..కావాలనే చంపాలని కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే డాక్టర్స్ మాత్రం ఆయన కంటిన్యూగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ఫుడ్ విషయంలో రిస్క్రిప్షన్ లేకుండా మద్యపానం ఎక్కువగా సేవించడం వల్లే ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినట్లు ధృవీకరించారు . దీంతో ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news