Moviesరాజమౌళి ఆ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారన్న విషయం మీకు...

రాజమౌళి ఆ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారన్న విషయం మీకు తెలుసా..? ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

దర్శకు ధీరుడు రాజమౌళి పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అరుపులు కేకలు వినపడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థానాన్ని సంపాదించుకున్న రాజమౌళి రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. కాగ స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దర్శకుడుగా పరిచయమైన రాజమౌళి .. అంతకుముందు శాంతినివాసం అనే సీరియల్ ని డైరెక్ట్ చేశారు.

అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి .. ఓ కమెడియన్ కి అసిస్టెంట్గా చేసారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . ఒకప్పటి స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న దివంగత కమెడియన్ వేణుమాధవ్ కి రాజమౌళి అసిస్టెంట్గా చేశారు . ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఓ మూవీలో రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా చేశాడు .

2004లో రాజమౌళి దర్శకుడుగా వచ్చిన మూడో చిత్రం సై . నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్ గా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కమెడియన్ వేణుమాధవ్ చిన్న పాత్ర చేశాడు. నల్లబాబు నాకి చంపేస్తా అంటూ వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది . కాగా ఈ సినిమాలో రాజమౌళి – వేణుమాధవ్ కి అసిస్టెంట్గా చిన్న క్యామియో పాత్ర చేశారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ని రాజమౌళి అభిమానులు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . దీనితో రాజమౌళి పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news