Moviesసినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయేది ఈ హీరోనే.. ఇదే...

సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయేది ఈ హీరోనే.. ఇదే పక్క ప్రూఫ్..!!

సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా వరుణ్ తేజ్ – శర్వానంద్ కూడా ఆలస్ట్ లో నుంచి బయటికి వచ్చేసారు. దీంతో సోషల్ మీడియాలో మిగతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పేర్లు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . తెలుగు చలనచిత్ర పరిశ్రమలు పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉన్న హీరోలు ఎవరో ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం ..!!

ప్రభాస్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ప్రభాస్ . పెళ్లి ఏజ్ ఎప్పుడో దాటిపోయింది . అసలు పెళ్లి చేసుకుంటాడా ..? లేదా..? అని కూడా అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు . అయితే రీసెంట్గా ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “నేను తిరుపతిలో పెళ్లి చేసుకుంటాను” అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంతో ..ఈయన కూడా త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

రామ్ పోతినేని : ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఇంకా సింగిల్గానే ఉన్నాడు . అయితే పెళ్లి విషయం ఎప్పుడు ఎత్తిన సరే దాటవేస్తూ వచ్చారు. అసలు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడో లేదో కూడా డౌటే..?

విజయ్ దేవరకొండ : రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు 33 సంవత్సరాలు . కచ్చితంగా ఈ అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసుకోడు అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం జనాల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . మరీ ముఖ్యంగా అమ్మాయిలు విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . అన్నట్లు రష్మిక మందనతో విజయ్ దేవరకొండ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఏమో మరి ఈ జంట కూడా పెళ్లి పీటలెక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

వీరే కాకుండా ఇండస్ట్రీలో సాయిధరమ్ తేజ్ , తరుణ్ , అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అడవి శేష్, నారా రోహిత్ ఇలా అందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు. వీళ్ళు పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అనేది అభిమానులకు క్వశ్చన్ మార్క్ గానే ఉంది. కాగా త్వరలోనే అడవి శేష్ ..సుప్రియను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఒక్క వేళ అదే నిజమైతే..ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్ళి పీటలు ఎక్క బోయేది ఆయనే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news