News"నా పాత్ర అందుకే దొబ్బేసింది"..బాహుబలి సినిమా పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

“నా పాత్ర అందుకే దొబ్బేసింది”..బాహుబలి సినిమా పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

“బాహుబలి”.. ఈ పేరు చెప్తూ ఉంటేనే బాడీలో తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తాయి . అంతేకాదు గూస్ బంప్స్ మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఏవేవో కళ్ళ ముందు మెదులాడేలా చేస్తూ ఉంటాయి . అంతటి క్రేజీ స్దానాని సంపాదించుకుంది అందరి మనసులో బాహుబలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్రకు కరెక్ట్ రైజేషన్స్ బాగా డిజైన్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి . కాగ ఈ సినిమాలో మొదటి పార్ట్ లో హీరోయిన్గా తమన్నా .. రెండవ పార్ట్ లో హీరోయిన్గా అనుష్క శెట్టి నటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. మనకు తెలిసిందే తమన్నా ప్రెసెంట్ బాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లస్ట్ స్టోరీస్ 2 లో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాహుబలికి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. ఇదే క్రమంలో తమన్నా మాట్లాడుతూ .. “బాహుబలి లాంటి యాక్షన్ సినిమాలతో కేవలం హీరోలకే ఎక్కువ గుర్తింపు వస్తుంది”..అని ఓపెన్ గా చెప్పేసింది.

“అంతేకాదు.. అందుకే ఈ సినిమాతో ప్రభాస్ రానాలకు మంచి గుర్తింపు వచ్చి వాళ్ళ స్టేటస్ మారిపోయేలా చేసింది అని.. ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ – అనుష్కకు కూడా ఎంతో కొంత గుర్తింపు వచ్చింది అని.. బాహుబలి సినిమాతో నాకు అంత గుర్తింపు రాలేకపోయింది అని బాధపడింది. దానికి మెయిన్ రీజన్ నా క్యారెక్టర్ చాలా చిన్నగా ఉండడమే ..అందుకే ఈ సినిమాలో నేను నటించాను అని చాలా తక్కువ మందికి తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది . అంతేకాదు కొందరు కావాలని ఆమెను ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news