Moviesబాలయ్యకు స్పెషల్ గా విష్ చేసిన సింగర్ నోయల్.. క్రేజీ ర్యాప్...

బాలయ్యకు స్పెషల్ గా విష్ చేసిన సింగర్ నోయల్.. క్రేజీ ర్యాప్ సాంగ్ రిలీజ్(వీడియో)..!!

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా ఆయనను వెండితెరపై చూస్తున్నంతసేపు థియేటర్లలో అదో ఊపు అటోమెటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఆయన డైలాగులు చెబుతున్నంతసేపు ప్రేక్షలకుందరికీ మైమరపు మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నటనలో సింహా.. అభిమానులకు లెజెండ్.. వెండితెరకు ఆయనో అఖండగా సినీ ఇండస్ట్రీలో కళామతల్లి ముద్దుబిడ్డగా రాణిస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు నేడు.

ఈ క్రమంలోనే బాలయ్య బర్త్ డే సందర్భంగా.. సినీ స్టార్స్.. రాజకీయ ప్రముఖులు.. అందరు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య డై హార్ట్ ఫ్యాన్ నోయల్ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా.. ఓ ర్యాప్ సాంగ్ తీర్చిదిద్దాడు. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నోయల్ సేన్ రాసి ఆలపించిన ఈ పాటకు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడు. “నందమూరి సింహం వచ్చే సూడు.. “అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఈపాట విన్న అభిమానులు జై బాలయ్య అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ బర్తడే బాలయ్య కు మరింత స్పెషల్ గా మారిపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయ్యి యూట్యూబ్ ని షేక్ చేసేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news