Moviesలావణ్య నిశ్చితార్ధపు ఉంగరం కాస్ట్ అన్ని కోట్లా..? స్పెషాలిటిస్ ఇవే.. మెగాఫ్యామిలీ...

లావణ్య నిశ్చితార్ధపు ఉంగరం కాస్ట్ అన్ని కోట్లా..? స్పెషాలిటిస్ ఇవే.. మెగాఫ్యామిలీ బాగా రిచ్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా సరే లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొద్ది గంటల క్రితమే వీరు నిశ్చితార్థపు ఉంగరాలతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు . గత కొంతకాలంగా వీళ్లిద్దరు ప్రేమాయణం నడుపుతున్నారు అని ..

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించినా ఈ జంట ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వలేదు.. గుట్టుచప్పుడు కాకుండా యవ్వరమంతా పూర్తి చేసిన తర్వాత ఈ జంట నిశ్చితార్థపు డేట్ ను లాక్ చేసుకుని ఫైనల్ గ్రాండ్గా అంగరంగ వైభవంగా అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు – బంధువులు – స్నేహితులు మధ్య నిశ్చితార్థపు వేడుకను కంప్లీట్ చేసుకున్నారు .

అయితే ఈ నిశ్చితార్ధపు వేడుకకి సంబంధించిన కొన్ని పిక్స్ ను వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. కాగా ..ఈ నిశ్చితార్థపు వేడుక రింగ్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి . వరుణ్ తేజ్ లో ఫింగర్ కి ఉన్న రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..ఆ రింగ్ స్టోన్ మీద “Lav” అని రాసి ఉంటుంది అంట. అదే లావణ్య త్రిపాఠి దగ్గరకు వచ్చేసరికి ఆ డైమండ్ రింగ్ పై “Var” అని డిజైన్ చేయించారట.

అలా స్పెషల్ గా డిజైన్ చేయించుకొని వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. దీంతో వీళ్ళ నిశ్చితార్ధపు ఉంగరాలకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రింగ్ కాస్ట్ ఒక్కొక్కటి 6 కోట్లు ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ నిశ్చితార్ధపు ఉంగరాల పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news