Newsవావ్: బన్నీ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన 'AAA...

వావ్: బన్నీ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన ‘AAA సినిమాస్’..ఒక్క టికెట్ ఖరిదు ఎంతంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ..ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లేవల్ లో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్దాయిలో క్రేజ్ దక్కించుకోవడానికి చూస్తున్నారు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు మరోసారి వైరల్ గా మారింది . ఐకాన్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ రీసెంట్ గా AAA అనే మల్టీప్లెక్స్ నిర్మించిన విషయం తెలిసిందే .

మహేష్ బాబు ఏఎంబి సినిమా తరహాలో ఈ మల్టీప్లెక్స్ కి ఏసియన్స్ అల్లు అర్జున్ అన్ని నామకరణం చేశారు . స్టార్టింగ్ నుంచి AAA గురించి సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న అభిమానులకు రీసెంట్ గానే గుడ్ న్యూస్ వినిపించాడు అల్లు అర్జున్ . ఆ సిని మల్టి ప్లెక్స్ గ్రాండ్ గా లాంచ్ అయింది . ఈ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది .

ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తో పాటు ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అంతేకాదు చాలా స్టైలిష్ గా ఉండే సీట్లతో చాలా ట్రెండీ గా.. చాలా హైటెక్నాలజీస్ యూస్ చేసి మరి ఈ థియేటర్ ని నిర్మించిన్నట్లు తెలుస్తుంది . తన మల్టీప్లెక్స్ లాంచింగ్ బన్నీ హాజరు కావడంతో ప్రాంతం మొత్తం అభిమానులతో రద్దీగా మారిపోయింది . అంతేకాదు ఇంటీరియర్ మొత్తం అబ్బుర పరిచే విధంగా ఉన్నాయి . ఇందులో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండగా ..అందులో ఒకటి అల్ట్రా హెచ్ డి సిస్టం కలిగిన ఎల్ఈడి స్క్రీన్.. మిగిలినవన్నీ నార్మల్ ప్రొజెక్టర్ స్క్రీన్ గా అమర్చబడ్డాయి. అయితే లోపల సెట్టింగ్ ఇంటీరియర్ మొత్తం హై క్వాలిటీ తో హై క్లాస్ రేంజ్ లో ఫిక్స్ చేశారు. అలాగే భారీ ఫుడ్ కోర్ట్ ను కూడా ఏర్పాటు చేశారు . ఈ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 295 రూపాయలు నిర్ణయించారు పెద్దలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news