Newsవామ్మో..చిరంజీవి సినిమా కోసం సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ కండీషన్..? అన్ని కోట్లు...

వామ్మో..చిరంజీవి సినిమా కోసం సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ కండీషన్..? అన్ని కోట్లు కావాలా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లు అందుకున్న చిరంజీవి .. రీసెంట్ గానే గాడ్ ఫాదర్ – వాల్తేరు వీరయ్య సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా షూట్ లో బిజీ బిజీగా గడిపిస్తున్నారు . ఈ సినిమా కంప్లీట్ అయిపోగానే మరో ఇద్దరు డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి .

వాళ్ళల్లో ఒకరు వశిష్ట.. మరొకరు కళ్యాణ్ కృష్ణ . బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన వశిష్ట చిరంజీవితో సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కించాలని ఆశపడుతున్నారు . ఇక బంగార్రాజు లాంటి మూవీ తో కళ్యాణ్ కృష్ణ హిట్ డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళ్లిపోయాడు . ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణ – మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమాలో టాలీవుడ్ మరో యంగ్ హీరో కూడా ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ . డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు జొన్నలగడ్డ .. ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తున్నారట . అంతేకాదు డీజే టిల్లు స్క్వేర్ సినిమా కోసం మూడు కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి . ఇలా ఒక్క సినిమా హిట్టు కొట్టగానే ఇన్ని కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడంతో సిద్దు జొన్నలగడ్డ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news