Moviesఉపాసన బిడ్డకి "ఉయ్యాల" రెడీ.. స్పెషాలిటి ఏంటో తెలుసా..? ఎవరు ఇచ్చారంటే..?

ఉపాసన బిడ్డకి “ఉయ్యాల” రెడీ.. స్పెషాలిటి ఏంటో తెలుసా..? ఎవరు ఇచ్చారంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా కోడలు ఉపాసన పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగ కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ కొన్ని నెలల క్రితమే ఉపాసన అందజేసింది. మెగా కోడలు ఉపాసన గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే . త్వరలోనే పండు లాంటి పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతుంది . ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసనకి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది .

కాగా రీసెంట్గా ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్గా సీమంతం జరుపుకున్న ఉపాసన .. మరి కొద్ది రోజుల్లోనే డెలివరీ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే పుట్టబోయే బేబీ కోసం ఉపాసనకు అద్భుతమైన ఊయలను తయారు చేయించారు ఆమె ఫ్యాన్స్ . ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఉపాసన. ఉపాసన ఎంతో మంది అనాధ పిల్లలకు హెల్ప్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాళ్ళల్లో చారిటీ ట్రస్ట్ ఉపాసనకు ఈ గిఫ్ట్ అందజేసింది . ఉపాసన రన్ చేస్తున్న ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ లో ప్రజ్వల ఫౌండేషన్ కూడా ఒకటి . ప్రజ్వల ఫౌండేషన్ లోని మహిళలు ఉపాసనకు ఈ ఊయలను గిఫ్ట్ గా పంపారు . ఈ ఉయ్యాల కంప్లీట్ గా ఆ ఫౌండేషన్ లో పని చేస్తున్న మహిళలు సొంత చేతులతో స్వయంగా ఒరిజినల్ చెక్కలతో చేయబడింది . సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకుని బయట పడ్డ మహిళలని ఈ సంస్థ అందుకుంటుంది.

ఆ మహిళలు ఉపాసనకు ఈ గిఫ్ట్ పంపారు. ఈ సంస్థకు ఉపాసన ఎప్పటినుంచో విరాళాలు అందిస్తుంది. దీంతో మెగా వారసుడి కోసం స్పెషల్ గిఫ్ట్ ని అందజేశారు ప్రజ్వల ఫౌండేషన్ . ఈ ఊయల బలం, ఆత్మగౌరవం, ఆశకి ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండి పోతుంది అని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ పెటింది. ప్రేమతో పంపిన గిఫ్ట్ కావడంతో ఉపాసన ఎంతో సంతోషంగా ఊయలని రిసీవ్ చేసుకుంది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news