Moviesయాంకర్ విష్ణు ప్రియకు జెడి చక్రవర్తి మూతి పగిలిపోయే ఆన్సర్.....

యాంకర్ విష్ణు ప్రియకు జెడి చక్రవర్తి మూతి పగిలిపోయే ఆన్సర్.. ఆ ఒక్క మాటతో ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో పిల్ల..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ హీరోగా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో జెడి చక్రవర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇప్పుడంటే ఆయన హవా తగ్గిపోయింది . కానీ ఒకప్పుడు శివ – మనీ – గులాబీ – సత్యా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి జెడి చక్రవర్తి అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలిగిపోయిన సంగతి తెలిసిందే .

ఆ తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన ఈ హీరో మెల్లమెల్లగా తనకంటూ మల్ళీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు. కాగా తెలుగులో పలు సినిమాల్లో వెబ్ సిరీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న జెడి చక్రవర్తి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై యాంకర్ విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ ను తిప్పి కొట్టాడు . అంతేకాదు రీసెంట్గా షో లో పాల్గొన్న విష్ణుప్రియ – జెడి చక్రవర్తి గారితో ఈ సిరిస్ చేశానని .. ఆయనతో ట్రావెల్ చేశానని.. ఆయన పద్ధతులు ..ఆయన బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చేసింది అని ..ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. ఇదే విషయం ఆయనకు చెప్పానని.. చెప్పుకొచ్చింది .

కాగా యాంకర్ విష్ణు ప్రియ మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇస్తూ జెడి చక్రవర్తి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు . “యాంకర్ విష్ణుప్రియ నేను ఓ వెబ్ సిరీస్ లో నటించాం.. త్వరలోనే అది రిలీజ్ కాబోతుంది.. దాదాపు 40 రోజులు కలిసి షూట్ చేశాం .. ఆ సమయంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఏర్పడింది. ఆ డైరెక్టర్ ఆ టైంలోనే నా సినిమాలను చూడమంటూ యాంకర్ విష్ణుప్రియ కి సలహా ఇచ్చారు . ఈ క్రమంలోనే ఆమె నా పాత్రలో ప్రేమలో పడిపోయింది . అంతేకానీ మీరు అనుకున్నది ఏమీ లేదు మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం మాత్రమే ఉంది “అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో జెడి చక్రవర్తి యాంకర్ విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . కొందరు విష్ణు ప్రియకి మూతి పగిలిపోయే ఆన్సర్ జెడి చక్రవర్తి ఇచ్చారని ..ఆయన సీనియర్ హీరో.. ఆయన చాలా మంచివాడు..ఎవరితో ఎలా నడుచుకోవాలో బాగా తెలుసు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news