Moviesమెగా డైరెక్టర్ తో బాలయ్య మూవీ ఫిక్స్..అఫిషియల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. హీరోయిన్...

మెగా డైరెక్టర్ తో బాలయ్య మూవీ ఫిక్స్..అఫిషియల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా..?

“గ్లోబల్ లైన్” గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలకు కమిట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తదుపరి సినిమా ” భగవంత్ కేసరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో మాస్ మాసివ్ గా డైరెక్టర్ చేసిన అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే బాలయ్య ఎన్.బి.కె 108 తరువాత తదుపరి ఏ సినిమాలో బాలయ్య నటించబోతున్నాడు అంటూ చర్చలు జరిగాయి.

అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చేశాడు . నందమూరి బాలయ్య – అనిల్ రావిపూడి తర్వాత డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమా నటించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది . బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విష్ చేస్తూ ఇవాళ ఎంతో గ్రాండ్గా పూజ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు . దీనికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి .

కాగా ఫస్ట్ పోస్టర్ తోనే కిర్రాక్ లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు బాబి . “నందమూరి బాలయ్య అంటే ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు.. కానీ ఆయన ప్రపంచం ఏంటో ఎవరికైనా తెలుసా ..?” అన్న విధంగా ఉండే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో మందు బాటిళ్లు.. పలు ఆయుధాలు ఉన్నాయి . ఈ క్రమంలోనే ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ బాబి. అంతేకాదు ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నారట బాబి. చూడాలి మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news