Movies"యంగ్ సింహం"లా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మోక్షజ్ఞ నయా లుక్.....

“యంగ్ సింహం”లా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మోక్షజ్ఞ నయా లుక్.. ఏమున్నాడు రా బాబు..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలయ్య ..నాన్న పేరుని అంచలంచలుగా ఎదిగేలా చేస్తూ సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గౌరవాన్ని ఇమేజ్ ని తీసుకొచ్చారు . నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు . గత కొన్ని సంవత్సరాల నుంచి అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ .. ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ని ఊరిస్తూనే వచ్చినా.. ఫైనల్లి ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ టైం ఆసన్నమైంది అంటూ తెలిసిపోతుంది .

ఇదే విషయాన్ని ఓపెన్ గా తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు మోక్షజ్ఞ . నాన్న పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ “హ్యాపీ బర్త్డే ఎన్ బి కె” అంటూ తన సరికొత్త లుక్ ని రిలీజ్ చేశారు . మనకు తెలిసిందే మొదటి నుంచి మోక్షజ్ఞ కొంచెం బొద్దుగా ఉంటాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అంటే పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి అని.. బాలయ్య మోక్షజ్ఞను బాగా ట్రైన్ చేశారు . మంచి ట్రైనర్ తో పర్ఫెక్ట్ బాడీ ఫిట్నెస్ వచ్చేలా మోక్షజ్ఞను పూర్తిగా మార్చేశాడు బాలయ్య.

ఇప్పుడు మోక్షజ్ఞ లుక్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది . అంత బొద్దుగా ఉన్న అబ్బాయి తక్కువ టైం లోనే ఇంత ఫాస్ట్ గా ఎలా తగ్గిపోయాడా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతడు తన స్నేహితులతో కనిపించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి . ఈ ఫోటోల్లో స్లిమ్ బాడీతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు నందమూరి మోక్షజ్ఞ . దీంతో యంగ్ సింహం అంటూ నందమూరి అభిమానులు ఆయన లుక్స్ ను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు కచ్చితంగా ఇదే లుక్స్ కంటిన్యూ అయితే మోక్షజ్ఞ నాన్న తర్వాత ఇండస్ట్రీని ఏలేసే రారాజు అయిపోవడం కన్ఫామ్ అంటూ పొగిడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నందమూరి మోక్షజ్ఞ నయా లుక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news