Movies"ఆదిపురుష్" సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళకి కొత్త కండీషన్..? అవి వేసుకుంటే...

“ఆదిపురుష్” సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళకి కొత్త కండీషన్..? అవి వేసుకుంటే థియేటర్ లోకి నో ఎంట్రీ..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమా తర్వాత తన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్న ప్రభాస రీసెంట్గా నటిస్తున్న సినిమా ” ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఓంరావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆది పురుష్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు జనాలు .

మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం తిరుపతిలో ఆది పురుష్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది . ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చిన్న జీయర్ స్వామి అతిథులు అందరూ ఈ వేడుకకు హాజరై ప్రభాస్ను ఆదిపురుష్ టీం ని ఎంకరేజ్ చేశారు . కాగా ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొత్త న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు ఎవరు చెప్పులు ధరించకూడదు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ .

తిరుపతిలో జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై హీరో ప్రభాస్ తో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులు అతిథులు ఎవరు చెప్పులు వేసుకో రాలేదు . ఈ క్రమంలోనే అందరూ చెప్పులు విప్పి కాళ్ళతో తిరిగారు . ఇదొక్కటే ఆది పురుష్ సినిమా రిలీక్ చేసే ప్రతి సినిమా థియేటర్లో ప్రతి షోలో ఓ సీట్ హనుమంతుడి కోసం కేటాయిస్తున్నాము అంటూ భక్తిశ్రద్ధలతో ఈ సినిమా తీశామని చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లే ఫ్యాన్స్ ..సినిమా జనాలు కూడా చెప్పులు వేసుకోకూడదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు మనం ఏ గుడికి వెళ్ళిన చెప్పులు ఆలయం బయటే వదిలేయడం అలావాటు. అదేవిధంగా ఆదిపురుష్ అనేది ఓ ఆలయం అందుకే ఈ సినిమాకి వెళ్లే వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు అంటూ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news