Moviesసినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. 108 ప్రాంతాలలో 108 భారీ...

సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. 108 ప్రాంతాలలో 108 భారీ హోర్డింగ్స్తో బాలయ్య 108 టైటిల్..!!

టాలీవుడ్ నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య రీసెంట్గా నటిస్తున్న సినిమా ఎన్.బి.కె 108 . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 8న రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. నిజానికి జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. అయితే ఆయన బర్త్డే సందర్భంగా రెండు రోజుల ముందే నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాలి అని ..బర్త్ డే ట్రీట్ అందివ్వాలి అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

అయితే ఇందుకోసం మేకర్స్ గట్టి గానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది . టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తంగా 108 ప్రాంతాలలో 108 భారీ హోర్డింగ్స్ తో ఈ మాస్ మూవీ టైటిల్ను జూన్ 8న లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . వవీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఈ సినిమాల్లో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాకి ప్లస్ గా తమన్ సంగీతం నిలవనుంది . బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేసినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే బాలయ్య కెరియర్ లోనే ఈ సినిమా మరో హిట్గా నిలవబోతోంది అంటూ ఫ్యాన్స్ కన్ఫామ్ అయిపోయారు . అంతేకాదు ఈ సినిమాకి “భగవంత్ లాల్ కేసరి” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. చూద్దాం మరి జూన్ 8వ తేదీ బాక్స్ ఆఫీస్ ని.. యూట్యూబ్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో బాలయ్య..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news