Moviesఇండస్ట్రీలో మోస్ట్ లక్కియెస్ట్ ఫెలో విజయ్ దేవరకొండ.. మొత్తం ఎన్ని ఫ్లాప్...

ఇండస్ట్రీలో మోస్ట్ లక్కియెస్ట్ ఫెలో విజయ్ దేవరకొండ.. మొత్తం ఎన్ని ఫ్లాప్ మూవీల నుంచి తప్పించుకున్నారంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ . ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడో తెలియదు కానీ అప్పటినుంచి సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్నాడు. మరీ ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసాడు . ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు కావస్తున్న సరే ఇప్పటికి ఆ సినిమా క్రేజ్ తోనే అవకాశాలు అందుకుంటున్నాడు .

అంతేనా ఆ సినిమాకు వచ్చిన పాపులారిటీతోనే ఫేమస్ అయ్యాడు. కాగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఖుషి . సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కాకుండా గౌతం తిన్నురి దర్శకత్వంలో మరో సినిమాకి కనెక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ . కాగా ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ చాలా లక్కీయెస్ట్ ఫెలో అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దానికి కారణం ఆయన ఇండస్ట్రీ నుంచి ఎన్నో బ్లాక్బస్టర్ డిజాస్టర్ నుంచి తప్పించుకోవడమే.

అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు విజయ్ దేవరకొండ దాదాపు 7 సినిమాల ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారట. అవన్నీ కూడా బిగ్ హీరోలు చేసి ఫ్లాప్ కొట్టిన సినిమాలే అని తెలుస్తుంది. కాగా తాజాగా విజయ్ చేయాల్సిన మరో ప్రాజెక్టు కూడా మరో హీరో చేసి ఫ్లాప్ కొట్టాడు అంటూ తెలుస్తుంది . అది ఎవరో కాదు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం “అన్ని మంచి శకునములే”. ఈ చిత్రం మొదట విజయ్ దేవరకొండకు వినిపించారట డైరెక్టర్. అయితే స్టోరీ కంటెంట్ పెద్దగా బాగో లేకపోవడంతో రిజెక్ట్ చేసారట. అది అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . ఇలా మరోసారి తను ఎంత లక్కీ అని ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ . ఏది ఏమైనా సరే విజయ్ దేవరకొండ ప్లానింగ్ మామూలుగా లేదు అంటూ జనాలు ఆయనను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news