Movies'బలగం' సినిమాలో ప్రియదర్శి పాత్రను రిజెక్ట్ చేసిన ఆ తెలుగు హీరో...

‘బలగం’ సినిమాలో ప్రియదర్శి పాత్రను రిజెక్ట్ చేసిన ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..? టైం బ్యాడ్ అంటే ఇదేగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు . అలా బోలెడన్ని సార్లు జరిగి ఉంటాయి. మన ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలకి ఇలాంటి సిచువేషన్ ఎదురయింది .. ఫేస్ చేశారు . మన కోసం రాసుకున్న కథను వేరే హీరో తీసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం. ఫ్లాప్ అయితే ఓకే లైట్ గా తీసుకుంటాం..హిట్ కొడితే మాత్రం కుళ్ళుకొని చచ్చిపోతాం..

కాగా అలా ఎంతో మంది హీరోలు టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేశారు .ఆ లిస్ట్ లోకే వస్తాడు టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న శ్రీ విష్ణు. రీసెంట్ కాలంలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన “బలగం” సినిమాను చేతులారా రిజెక్ట్ చేసుకున్నాడు శ్రీ విష్ణు . బలగం సినిమాలో ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వేణు ఈ సినిమాకి తనదైనా స్టైల్ లో దర్శకత్వం వహించి క్లీన్ క్లాసిక్ హిట్ ను అందుకున్నాడు .

ఈ సినిమా కి మొదట అనుకున్న హీరో శ్రీ విష్ణు అంటూ తెలుస్తుంది . అయితే శ్రీ విష్ణుకు కూడా కథ బాగా నచ్చిందట. తెలంగాణ యాస అంత పర్ఫెక్ట్ గా పలక లేకపోవడంతోనే ఈ పాత్రకు నో చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే ప్రియదర్శిని అప్రోచ్ అయ్యారట . ప్రియదర్శి లాంటి పాత్రలను ఎంత చక్కగా చేస్తాడో మనకు బాగా తెలిసిందే. నాచురల్ యాక్టింగ్ లో ఇరగదీస్తాడు అందుకే వేణు సైతం ఈ పాత్రకు ప్రియదర్శని ఫిక్స్ చేశాడు. తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అలా చేతులారా ఓ మంచి సినిమాని మిస్ చేసుకున్నాడు శ్రీ విష్ణు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఏ మాటక మాట ఈ పాత్రలో శ్రీ విష్ణు కన్నా ప్రియదర్శినే సూపర్ గా యాక్ట్ చేయగలడు ..యాక్ట్ చేశాడు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news