Moviesతెలుగు ఇండస్ట్రీలో శ్రీ లీల టాప్ ప్లేస్ .. వరుస కమిట్మెంట్లు...

తెలుగు ఇండస్ట్రీలో శ్రీ లీల టాప్ ప్లేస్ .. వరుస కమిట్మెంట్లు వెనుక అన్ని త్యాగాలు ఉన్నాయా…?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ యంగ్ హీరో కాదు సీనియర్ హీరో కాదు ..హిట్ హీరో కాదు ఫ్లాప్ హీరో కాదు ..అందరికీ శ్రీలీలనే కావాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ డైరెక్టర్ హీరోలను కాల్ షీట్స్ అడుగుతున్నా ..ఫస్ట్ వెళ్లి శ్రీలీల కాల్ షీట్స్ తీసుకోరండి అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారట . అంత దాసోహం అవ్వబట్టే ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు పట్టుకొని ఉంది .

ఇప్పటివరకు అమ్మడు నటించి రిలీజ్ అయినవి రెండు అంటే రెండు సినిమాలే. అందులో ఒక సినిమా హిట్ మరో సినిమా ఫట్ ..అయినా కానీ శ్రీలీలకు ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఆమెలోని హాట్ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ ఆమె డాన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆమె పడిన కష్టాని..చెప్పుకొస్తున్నారు. ఆమె ఏం రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోలేదని ..ఆమె తన చిన్న వయసులో నుంచి హీరోయిన్ అవ్వాలి అంటూ ఎంతో కష్టపడి నటన నేర్చుకుంది అని చెప్పుకొస్తున్నారు ఫాన్స్ .

అంతేకాదు స్కూలింగ్ ఏజ్ లోనే ఆమె ఒకపక్క స్కూల్ మరోపక్క స్పోర్ట్స్ మరోపక్క యాక్టింగ్ నేర్చుకునింది అని . ఆలా చిన్నప్పుడు తన ఎంజాయ్మెంట్ అన్ని మిస్ చేసుకుని మరి ఇప్పుడు ఈ స్దానానికి చేరుకుందని చెప్పుకొస్తున్నారు . చిన్నప్పుడు ఆమె అసలు ఆడుకోలేదని .. క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీ షెడ్యూల్ తో గడిపేసిందట అలా కమిట్మెంట్స్ ఇచ్చుకోవడం బట్టే ఇప్పుడు ఇంత మంది శ్రీలీలకు కమిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా సరే శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలలో నాలుగు సినిమాలు హిట్ అయినా సరే కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలే సే మహారాణిలా అమ్మడు తయారవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్ . చూద్దాం మరి శ్రీలీల జాతకం ఎలా ఉందో..? ఆమె దశ ఎలా తిరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news