Movies"మిస్టరీ మ్యాన్" గుట్టు విప్పిన కీర్తి సురేష్.. అతగాడితో సంబంధం పై...

“మిస్టరీ మ్యాన్” గుట్టు విప్పిన కీర్తి సురేష్.. అతగాడితో సంబంధం పై ఓపెన్ స్టేట్మెంట్.. కుర్రాడు అంత స్పెషలా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎలా వైరల్ గా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరియు ముఖ్యంగా హీరోయిన్స్ కి సంబంధించిన ఇష్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా టాలీవుడ్ స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ..సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆమె తన పోస్ట్ లో ఓ అబ్బాయి తో క్లోజ్ గా దిగిన ఫోటోను షేర్ చేసింది .

అంతే అప్పటినుంచి కీర్తి సురేష్ కి కాబోయే హస్బెండ్ ఇతడే అంటూ అతగాడిని నానారకాలుగా ట్రెండ్ చేశారు . అంతేనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటూ వాళ్ళ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు . ఇలాంటివి భరించలేక కీర్తి సురేష్ ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది . ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ని కూడా నా మ్యారేజ్ విషయంలోకి లాగుతున్నారా..? అంటూ కీర్తి ఘాటుగా స్పందించింది . అంతేకాదు దీనిపై ఓ ట్వీట్ చేస్తూ అందరికి ఇచ్చిపడేసింది.

” హ హ ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ని ఈ వార్తల్లోకి లాగేసారా ..? నిజమైన మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తాను ..ఆగండి..సమయం రావాలి.. అప్పటివరకు చిల్ గా ఉండండి “అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది . దీంతో కీర్తి సురేష్ లైఫ్ లో మిస్టరీ మాన్ గా ఉన్న ఆ పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఇతగాడు ఫ్రెండ్ అంటూ చెప్పుకు రావడంతో సగం టెన్షన్ పోయింది. క్లారిటీ జనాలు మాత్రం కీర్తి సురేష్ ఆ అబ్బాయితో దిగిన ఫోటోలు ట్రెండ్ చేస్తున్నారు . చూడడానికి జంట బాగుంది అని ..ఈడు జోడు చక్కగా ఉంది అని ..పెళ్లి చేసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి కీర్తి సురేష్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news