Movies"దొంగ నాయాల".. తారక్ ని ఇలా ముద్దుగా పిలిచే హీరోయిన్ ఎవరో...

“దొంగ నాయాల”.. తారక్ ని ఇలా ముద్దుగా పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా..ఆశ్చర్యపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో తారక్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు . శత్రువులు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే . దానికి మెయిన్ రీజన్ తారక్ లో ఉన్న మంచి మనసే. హర్ట్ చేసే మాట అన్న చూసి చూడనట్టు వెళ్లిపోయే తారక్ సినిమా షూట్స్ లో మాత్రం చాలా సరదాగా ఫన్నీ ఫన్నీ గా ఉంటారట, మరి ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ విషయంలో తారక్ మరింత ఎంజాయ్ చేస్తూ ఉంటాడు .

కాగా ఈ క్రమంలోనే యమదొంగ సినిమా షూట్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి డైరెక్షన్లో హీరోగా ఎన్టీఆర్ – హీరోయిన్గా ప్రియమణి – మమతా మోహన్ దాస్ నటించిన సినిమా యమదొంగ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది. ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడే మమతా మోహన్ దాస్ – తారక్ ల మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ నడిచిందట .

ఈ సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. తారక్ – మమతా మోహన్ దాస్ ని చీట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు..” నెల్లూరు ట్రంకు రొడ్డు లో బట్టలు ఊడదీసి కొడతా నాయాలారా”.. అంటూ ఓ డైలాగ్ చెబుతుంది . అయితే ఆ డైలాగ్ ఆమెకి పలకడం రాక చాలా టేక్స్ తీసుకుందట . అంతేకాదు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడల్లా ఆ వర్డ్ విన్నప్పుడు అసలైన మీనింగ్ తెలియని మమతా మోహన్ దాస్ ని చూసి తారక్ తెగ నవ్వెసేవాడట. ఎందుకు తారక్ నవ్వుతున్నాడో కూడా తెలియక చాలా ఫన్నీ కాన్వర్జేషన్ నడిచింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతే కాదు కొన్నిసార్లు తారక్ ని ఫనీగా మమతా మోహన్దాస్ అలా కూడా పిలిచేది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే తారక్ షూట్స్ లో ఇంత జాలిగా ఎంజాయ్ చేస్తాడు ఫన్నీగా ఉంటాడా..? అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఎందుకంటే తారక్ పైకి అలా కనిపించడు . కేవలం చాలా స్ట్రిక్ట్ గా సైలెంట్ గా అనిపిస్తాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news