Movies' ఏజెంట్ ' డిజాస్ట‌ర్ బాధ‌లో ఉన్న అఖిల్‌, నాగార్జున అదిరిప‌డే...

‘ ఏజెంట్ ‘ డిజాస్ట‌ర్ బాధ‌లో ఉన్న అఖిల్‌, నాగార్జున అదిరిప‌డే న్యూస్ బ‌య‌ట ప‌డింది…!

సినిమా రంగంలో విజయాలు.. అపజయాలు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండేవే. తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు సక్సెస్ రేటు అనేది ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అయితే ఒక్కటే తేడా..! సక్సెస్ వచ్చినా పెయిల్యూర్ వచ్చినా..హీరోల క్రేజ్ అంకెలు మాత్రం అటు ఆకాశాన్ని.. ఇటు పాతాళాన్ని తాకుతూ ఉంటాయి. ఒక హీరోకి నాలుగు ఐదు ప్లాపులు వచ్చినా సరైన హిట్టు పడితే అత‌డి క్రేజ్‌ ఎక్క‌డికో వెళ్ళిపోతుంది. ఒక్క ప్లాపు పడితే వెంటనే పాతాళానికి దిగిపోతుంది. ఇక టాలీవుడ్ లో దశాబ్దాల చరిత్ర ఉన్న అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు.

కెరీర్ ప్రారంభం నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. మంచి బ్యానర్లు.. మంచి దర్శకులతోనే ట్రావెల్ అవుతున్నాడు. అయితే సినిమాలు అన్ని వరుసగా పరాజయాలు పాలవుతున్నాయి. తొలి సినిమా అఖిల్ వినాయక్‌ దర్శకత్వంలో వచ్చింది. అఖిల్‌కు పీడకల మిగిల్చినంత ఘోరమైన ప్లాప్‌ అయింది. రెండో సినిమా సొంత బ్యాన‌ర్‌లో హలో చేశాడు. విక్రమ్ కుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నా కూడా ప్లాప్ అయింది. మూడో సినిమాకు వెంకీ అట్లూరి లాంటి ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఉన్నా కూడా సేమ్ రిజల్ట్.

ఇక నాలుగో సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌తో ఎట్టకేలకు యావరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐదో సినిమా ఏజెంట్ కు ఏకంగా మూడేళ్ల పాటు టైం తీసుకున్నాడు. సురేందర్ రెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ అనిల్ సుంక‌ర‌ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఏకంగా రు. 80 కోట్ల బడ్జెట్.. పైగా ఇందులో హీరోకు రెమ్యూనరేషన్ కూడా లేదు. ఇంత బడ్జెట్ అయినా కూడా సినిమాకు ఎలాంటి బజ్‌ లేదు. సినిమాకు పెట్టిన పెట్టుబడి హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా రు. 80 కోట్లు. మొత్తం మీద రు. 14 కోట్లు వెనక్కి వచ్చిందని చెప్తున్నారు.

అంటే రు. 66 కోట్లు భారీ నష్టం. అఖిల్ సినిమాకే ఏకంగా నిర్మాత నితిన్ కు 40 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు కాస్త అటు ఇటుగా రు. 70 కోట్ల నష్టాలు అంటే ఎవరు భరించలేరు. అటు నిర్మాత కూడా ఆర్థికంగా ఎంతో కుదేలవాల్సిన పరిస్థితి. ఇటు అఖిల్ కెరీర్ మరీ ఘోరంగా తయారైంది. ఏదో అక్కినేని హీరో అని చెప్పుకోవటానికి తప్ప సరైన హిట్ లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతోంది. ఇదే పరిస్థితి మరో రెండు సినిమాలకు కూడా కంటిన్యూ అయితే అఖిల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఏ వ్యాపారం లేదా మరో ప‌నో చేసుకోవడం బెటర్ అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అటు సోషల్ మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా అఖిల్ సినిమాల్లో కొనసాగాలి అనుకుంటే సరైన కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో తనదైన వ్యూహంతో వెళ్లాలి. నాగార్జున కూడా అఖిల్ కెరీర్ మీద బాగా ఫోకస్ చేయాలి. లేకపోతే అఖిల్‌ను టాలీవుడ్, తెలుగు సినీ ప్రేక్షకులు మర్చిపోయి రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news