Moviesసీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ ఆ స్టార్ హీరోతో ప్రేమాయ‌ణం న‌డిపిందా... ఇన్నాళ్ల‌కు...

సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ ఆ స్టార్ హీరోతో ప్రేమాయ‌ణం న‌డిపిందా… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ టాప్ సీక్రెట్‌..!

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ గురించి ఈ త‌రం ప్రేక్ష‌కుల్లో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు కాని.. 1980 వ ద‌శ‌కంలో ఆమె తెలుగులో ఓ స్టార్ హీరోయిన్‌. అయితే ఆమె హీరోయిన్‌గా రిటైరై చాలా యేళ్లు అయినా ఇప్ప‌ట‌కీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో న‌టిస్తూ ఉంటారు. ఆమె త‌న కుమారుడిని కూడా హీరోగా ప‌రిచ‌యం చేసింది. జ‌య‌సుధ న‌ట‌న‌లో స‌హజంగా చేస్తార‌న్న పేరుతోనే ఆమెకు స‌హ‌జ‌న‌టి అన్న పేరు స్థిర‌ప‌డిపోయింది.

ఆమె సినిమాల ప‌రంగా తిరుగులేని స్టార్ హీరోయిన్ అయినా వ్య‌క్తిగ‌త జీవితాన్ని స‌రిగా అంచ‌నా వేసుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె ముందుగా కృష్ణా జిల్లాకు చెందిన నిర్మాత కాక‌ర్ల రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం జ‌య‌సుధ ఇంట్లో వాళ్ల‌కు ఇష్టంలేదు. అయితే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఆమె రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను పెళ్లాడినా.. ఈ కాపురం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు.

ఆ త‌ర్వాత జ‌య‌సుధ బాలీవుడ్ నిర్మాత నితిన్‌క‌పూర్‌కు పెళ్లాడారు. అయినా వీరిద్ద‌రికి అంత స‌ఖ్య‌త లేదు. ఇక చివ‌ర్లో అయితే నితిన్ – జ‌య‌సుధ కొన్నేళ్ల పాటు ఎవ‌రి దారుల్లో వారు బ‌తికేశారు. పైరుకు మాత్ర‌మే వీరు భార్య‌భ‌ర్త‌లుగా ఉన్నా క‌లిసి కాపురం చేసింది త‌క్కువ‌. అయితే జ‌య‌సుధ కాక‌ర్ల రాజేంద్ర ప్ర‌సాద్‌ను పెళ్లి చేసుకోవ‌డానికి ముందే స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌.

ఈ విష‌యాన్ని సీనియ‌ర్ న‌టి కుట్టి ప‌ద్మిని త‌న తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. క‌మ‌ల్ ప్రియురాళ్ల లిస్ట్ చాలానే ఉంది. క‌మ‌ల్ వాణి గ‌ణ‌ప‌తితో పాటు సారిక‌ను పెళ్లి చేసుకుని ఇద్ద‌రికి విడాకులు ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత మ‌రో హీరోయిన్ గౌత‌మితో కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి ఆమెను వ‌దిలించుకున్నాడు. వీరు ముగ్గురు మాత్ర‌మే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ రేఖ‌, జ‌య‌సుధ‌, మ‌రో సీనియ‌ర్ న‌టీమ‌ణి శ్రీవిద్య కూడా క‌మ‌ల్ బాధితుల లిస్టులో ఉన్నార‌ట‌.

ఇక శ్రీదేవి కూడా క‌మ‌ల్‌ను ఇష్ట‌ప‌డ్డారు. క‌మ‌ల్ తెలుగు సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు జ‌య‌సుధ క‌మ‌ల్‌ను ఇష్ట‌ప‌డ్డార‌ని.. అదే టైంలో శ్రీదేవి కూడా ఆయ‌న్ను ప్రేమించింద‌ని.. అయితే క‌మ‌ల్ ఇద్ద‌రికి షాక్ ఇచ్చి వాణి గ‌ణ‌ప‌తిని పెళ్లి చేసుకున్నాడ‌ని కుట్టి ప‌ద్మిని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news