Newsషాకింగ్‌: విక్ట‌రీ వెంకటేష్ అలా చేస్తాడంటూ సీనియ‌ర్ హీరోయిన్ కంప్లైంట్‌

షాకింగ్‌: విక్ట‌రీ వెంకటేష్ అలా చేస్తాడంటూ సీనియ‌ర్ హీరోయిన్ కంప్లైంట్‌

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. తమిళ అమ్మాయి అయినా ఖుష్బూ ఒకానొక టైం లో తమిళనాడులో వీరాభిమానులు గుడి కట్టేంత క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో ప్రభుకు జోడిగా చిన్న తంబి ( తెలుగులో చంటి ) సినిమాలో నటించిన సమయంలో ఆమె ఒక అందాల‌ దేవత. ఖుష్బూ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉండేవారు. ఇక ఆమె తెలుగులోనూ స్టార్ హీరోలు అందరితోనూ మంచి అనుబంధాన్ని కంటిన్యూ చేస్తుంది.

ముఖ్యంగా తెలుగులో ఆమె విక్టరీ వెంకటేష్ అంటే చాలా స్పెష‌ల్‌. ఆమె వెంకీకి జోడిగా కలియుగ పాండవులు సినిమాలో నటించింది. వెంకటేష్ ఆమెకు తొలి హీరో. అలాగే వెంకటేష్‌కు కలియుగ పాండవులు సినిమా కూడా తొలి సినిమా కావటం విశేషం. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక వెంక‌టేష్ అంటే ఖుష్బూకు చాలా సెంటిమెంట్ అట‌. సెంటిమెంటల్ అనే పదంలో వెంకటేష్ సెంటి పార్ట్ అయితే… నేను మెంటల్ పార్ట్. అంతలా కలిసిపోతామ‌ని ఖుష్బూ చెపుతోంది. ఇక 1980ల నాటి హీరో, హీరోయిన్లు 32 మంది క‌లిసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నార‌ట‌. అందులో చిరు, ర‌జ‌నీకాంత్ ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఉన్నార‌ట‌.

వారంతా ప్ర‌తిరోజు ఏం తిన్నాం.. ఏం చేస్తున్నాం అన్న చిన్న చిన్న విష‌యాలు కూడా మెసేజ్‌లుగా పెట్టుకుంటామ‌ని.. అయితే వెంకీ ఆ గ్రూప్‌లో ఉన్నా కూడా పెద్ద‌గా రెస్పాండ్ అవ్వ‌డ‌ని ఖుష్బూ కంప్లైంట్ చేస్తోంది. ఇక ఖుష్బూ చాలా రోజుల త‌ర్వాత తెలుగులో గోపీచంద్ హీరోగా వ‌స్తోన్న రామబాణం సినిమాలో కీలక పాత్ర పోషించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news