Moviesపుష్ప2 - గేమ్ ఛేంజర్ - దేవర పోస్టర్ల గోల.. అన్నిటికంటే...

పుష్ప2 – గేమ్ ఛేంజర్ – దేవర పోస్టర్ల గోల.. అన్నిటికంటే టాప్ లో ఉండేది అదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలు పుష్ప2 – గేమ్ చేంజర్ – దేవర. ఈ మూడు సినిమాల కోసం జనాలు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ముగ్గు పాన్ ఇండియా హీరోలు కావడంతో..జనాలు ఈ సినిమాలకు సంబంధించిన విషయాలను కంపేర్ చేస్తూ.. మా హీతో తోపు అంటే మా హీరో కత్తి అంటూ చెప్పుకొస్తున్నారు.

పుష్ప 2: టాలీవుడ్ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేస్తున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు . సుకుమార్ దర్శకత్వంలో ఆయన రీసెంట్గా చేస్తున్న సినిమానే పుష్ప2. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్స్ తో రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు బన్నీ. కాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని లుక్స్ ని సుకుమార్ రీసెంట్గా రిలీజ్ చేశారు . మరి ముఖ్యంగా వీటిల్లో అమ్మవారి అవతారంలో ఉన్న బన్నీ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్: రామ్ చరణ్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమా కావడంతో మెగా ఫాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే మొదట్లో కాస్త డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న గేమ్ ఛేంజర్ పోస్టర్ ఆ తర్వాత చరణ్ లుక్స్ కు అట్రాక్ట్ అయ్యారు జనాలు. దీనితో మెగా ఫాన్స్ గేమ్ ఛేంజర్ పోస్టర్ని టాప్ ప్లేస్ లో నిలబెట్టారు,

దేవర : గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నెక్స్ట్ సినిమానే దేవర . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ లోగో మరింత అంచనాలు పెంచేసింది . బ్లాక్ లుంగీలో బ్లాక్ షర్ట్ లో ఎన్టీఆర్ చాలా భయానకలుల్ లో కనిపించారు . అంతేకాదు ఈ సినిమాతో మరో ఆస్కార్ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

కాగా ఇలా ముగ్గురు సినిమాలకు సంబంధించిన లోగోస్ వారి వారి కథను బట్టి వారి వారి రోల్స్ బట్టి ఉన్నాయి . అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా ఎన్టీఆర్ దేవర పోస్టర్ నే లైక్ చేస్తున్నారు జనాలు. న్యాచురాలిటీగా దగ్గరగా ఉండడం ..ఆ పాత్రలో ఇమిడిపోయినట్లు లుక్స్ కనిపించడం పర్ఫెక్ట్ గా.. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్లు కొరటాల డిజైన్ చేయడం ..ఈ పోస్టర్ కి హైలైట్ గా మారింది . మరీ ముఖ్యంగా సముద్రపు ఒడ్డున శవాల గుట్టల పడి ఉన్న రాళ్ల మధ్యలో ఎన్టీఆర్ అలా నిల్చోని గంభీరంగా లుక్స్ ఇవ్వడం కేక పెట్టిస్తుంది . మరి మీకు ఏ పోస్టర్ నచ్చింది.. పుష్ప2 నా..? గేమ్ ఛేంజర్ నా..? దేవర నా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news