Movies"సార్ సార్ " అంటూ స్టార్ హీరోని నమ్మించి ముంచేసిన పూరి...

“సార్ సార్ ” అంటూ స్టార్ హీరోని నమ్మించి ముంచేసిన పూరి జగన్నాధ్.. ఇప్పటికి మాటల్లేవా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం రంగుల ప్రపంచం .. ఎప్పుడూ ఎలా సీన్ మార్చేస్తారో వాళ్లకే తెలియదు, మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా తెలిసిన వారిని నమ్మి మోసపోతూ ఉంటారు . అలాగే తెలిసినవారిని ఎక్కువగా ముంచేస్తుంటారు . అదే లిస్టులోకి వచ్చాడు పూరి జగన్నాథ్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ ..ఓ స్టార్ హీరోని నమ్మించి నిలువునా ముంచేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అదే న్యూస్ మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు కొందరు అభిమానులు .

దీంతో మరోసారి పూరి జగన్నాథ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే పూరి జగన్నాథ్ గతంలో ఎలాంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడో. అయితే ఆ తర్వాత ప్రెసెంట్ పొజిషన్ ఎలా ఉందో కూడా మనకు తెలుసు . ఆయనను నమ్మి ఒక హీరో కూడా డేట్స్ ఇవ్వడం లేదు . అంతటి స్థాయికి దిగజారి పోయాడు పూరి జగన్నాథ్ . కాగా పూరి జగన్నాధ్ తన కెరియర్ లో ఎన్నో భారీ అంచనాలు పెట్టుకొని తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందులో ఒకటే కెమెరామెన్ గంగతో రాంబాబు . ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా.. హీరోయిన్గా తమన్నా నటించింది .

ఈ సినిమా మొత్తం సమాజంలో ఉండే పరిస్థితుల గురించి తెరకెక్కింది. అయితే జనాలకు ఈ కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాలేదు . ఈ క్రమంలోనే సినిమా ఫ్లాప్ అయింది . అంతేకాదు అప్పట్లోనే ఈ సినిమాకు హ్యూజ్ రేంజ్ లో డబ్బులు ఖర్చు పెట్టారు. ఇంకా పక్కాగా చెప్పాలంటే అప్పటివరకు తెరకెక్కిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటించిన హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీనికి ఈ సినిమా ఫ్లాప్ కి కారణం పూరి జగన్నాథ్ అంటూ తేల్చి చెప్పేసాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ “కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం పూరి జగన్నాథ్.. కథ చెప్పింది ఒకటి.. తెరకెక్కించింది మరోకటి.. షూటింగ్ టైంలో నేను అడిగాను ..అయితే పూరి జగన్నాథ్ ఈ కథ బాగుంటుంది సార్ అంటూ మేనేజ్ చేశాడు.. నేను కూడా పూరి జగన్నాథ్ ని నమ్మేశాను.. అలా గుడ్డిగా నమ్మడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన కామెంట్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news