Moviesఅనుష్క బ్లాక్‌బ‌స్ట‌ర్ అరుంధ‌తిలో చంద్ర‌మ్మ‌ చ‌రిత్ర తెలుసా…!

అనుష్క బ్లాక్‌బ‌స్ట‌ర్ అరుంధ‌తిలో చంద్ర‌మ్మ‌ చ‌రిత్ర తెలుసా…!

సూప‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ అరుంధ‌తి. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా చాలా హిట్ అయింది.ఈ సినిమాలో ప్ర‌తిపాత్ర‌కు కూడా ప్రాధాన్యం ఉంది. అయితే.. మ‌రీ ఎక్కువ‌గా చంద్ర‌మ్మ అనే క్యారెక్ట‌ర్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంట్లో ప‌నిమ‌నిషి. మూడు త‌రాలుగా ఆ ఇంట్లోనే ప‌నిమ‌నిషిగా చేసే పాత్ర‌కు సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. ఈ పాత్ర అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక‌, ఈ పాత్ర‌లో న‌టించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు.. మ‌నోర‌మ‌. ఈమెగురించి తెలుగు వారికి చాలా త‌క్కువ తెలుసు.

మనోరమ అస‌లు పేరు గోపి శాంతి. 1958లోనే సినీ రంగంలోకి వ‌చ్చారు. మ‌న్నార్‌గుడి(త‌మిళ‌నాడు) ప్రాంతానికి చెందిన మ‌నోర‌మ‌కు.. నాలుగు భాష‌లు వ‌చ్చు. నాట‌కాల ప్ర‌స్థానంంతో మొదలైన ఆమె సినీ జీవితం.. సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చే వ‌ర‌కుసాగింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో నటించినా.. కొద్ది సినిమాలే తెలుగులో చేసినా.. జొన్న‌లు దంచిన చేతులురా ఇవి అంటూ.. అల్ల‌రి ప్రియుడు సినిమాలో హీరో త‌ల్లిగా న‌టించిన తీరు ఇప్ప‌టికీ గుర్తుండిపోయింది.

మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం జయలలిత, మాజీ సీఎంలు అణ్ణా దురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధితో పాటు ఏపీ ఉమ్మ‌డి సీఎం నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు.

హీరోలైన శివాజీ గణేశన్, రజనీకాంత్‌, కమల్ హాసన్తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం సింగం-2. ఈమె త‌న ఆస్తిని కుమారుడికే కాకుండా.. త‌మిళ సినీ సంఘానికి(న‌డిగ‌ర్ ) కూడా రాశారు. ఆమె పేరుతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అవార్డును ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. 2015లో మ‌నోర‌మ మ‌ర‌ణించారు. ఇంత పేరు తెచ్చుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆమె హీరోయిన్‌గా నటించ‌కుండానే ల‌క్ష‌లాది మంది అభిమానులను సంపాయించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news