MoviesCustody Trailer : పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో చించేసిన...

Custody Trailer : పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో చించేసిన నాగచైతన్య.. హిట్ కొట్టేసాడురోయ్(వీడియో)..!!

టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “కస్టడి”. తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర ప్రమోషన్స్ ను ఫాస్ట్ గా కాని చేస్తున్న చిత్ర బృందం.. రీసెంట్గా ప్రమోషన్స్ లో భాగంగా “కస్టడీ” సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది .

కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు . ఈ సినిమాలో ప్రియమణి పొలిటిషీయన్ పాత్రలో కనిపించబోతున్నట్లు క్లిప్స్ ఆధారంగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో అరవింద స్వామి కూడా ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసిపోతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య పెర్ఫార్మెన్స్ టూ గుడ్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

ఇప్పటివరకు నాగచైతన్యని మనం రొమాంటిక్ లుక్స్ లోనే చూసామని.. ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా నాగచైతన్య – కృతి శెట్టి మధ్య వచ్చే సీన్స్ కూడా సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది . ఈ విధంగా గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా ద్వారా హిట్ పడిపోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ను ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం మే12న ఈ సినిమా ఎలాంటి హిట్ కొట్టబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news