Moviesఅద్గది..అందరి ముందే ఆ విషయంలో "నాగచైతన్య ను డైరెక్ట్ గా...

అద్గది..అందరి ముందే ఆ విషయంలో “నాగచైతన్య ను డైరెక్ట్ గా నిలదీసిన కృతిశెట్టి”..ఏ డేర్ రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబ్బమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి పేరు .. సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి.

ప్రజెంట్ కృతిశెట్టి తన ఆశలు అన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన “కస్టడీ” సినిమా పైన పెట్టుకొని ఉంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి – నాగచైతన్య – కస్టడి మూవీ టీం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు . ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ కృతిశెట్టిని డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు . రిపోర్టర్ ప్రశ్నిస్తూ..” ఉప్పెన తర్వాత మీకు ఉప్పెనల అవకాశాలు వచ్చాయి ..కానీ అలాంటి హిట్ మాత్రం అందలేదు. ఆ తర్వాత హిట్ వచ్చింది నాగ చైతన్యతోనే.. ఒకవేళ అదే నిజమైతే కస్టడీ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నారా..?” అంటూ ప్రశ్నించారు .

ఈ క్రమంలోనే కృతి శెట్టి మాట్లాడుతూ.. డైరెక్ట్గా పక్కనే ఉన్న “నాగచైతన్య మీరు నాకు సక్సెస్ ఇచ్చారా..?” అంటూ గట్టిగా ప్రశ్నించింది . దానికి చైతన్య సైతం షాక్ అయిపోయాడు . ఆయన మైక్ తీసుకొని లేదు..” అది నీ హార్డ్ వర్క్ .. అది నీ సక్సెస్ ” అంటూ ఆన్సర్ ఇచ్చాడు . ఈ క్రమంలోనే కృతి శెట్టి మాట్లాడుతూ ..”చూడండి.. సక్సెస్ అనేది ఎవరు ఎవరికి ఇవ్వరు ..వాళ్ళ హార్డ్ వర్క్.. వాళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది. ఒకరి వల్ల సినిమా సక్సెస్ అయింది అంటే అది నేను నమ్మను ..నిజమే నాగార్జున గారు, నాగ చైతన్య గారు ఉండడం వల్లనే సినిమా హిట్ అయి ఉండొచ్చు .. కానీ సక్సెస్ అనేది మాత్రం అందరికీ భాగం ..ఆ సమయంలో కథ కూడా ఇంపార్టెంట్ .. ఎంటర్టైన్ గా ఉంటుంది ..పైగా సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఇంకొంచెం ప్లస్ పాయింట్స్ ఉంటాయి.. అంతే తేడా ” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది . ఈ క్రమంలోని కృతి బోల్డ్ షాకింగ్ ఆన్సర్ కి జనాల సైతం ఫిదా అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news