Moviesహవ్వ.. 14 ఏళ్ల వయసులోనే ఛార్మి అలాంటి పని చేసిందా..? పెద్ద...

హవ్వ.. 14 ఏళ్ల వయసులోనే ఛార్మి అలాంటి పని చేసిందా..? పెద్ద ముదురు టెంకే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసిన ఛార్మికౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ” నీ తోడు కావాలి” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అందరి బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. మరీ ముఖ్యంగా చిరంజీవి – మహేష్ బాబు – నాగార్జున – వెంకటేష్ -ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని..హిట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది.

అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే అమ్మడు తెలిసి తెలియక తనంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమ్మడు కెరియర్ ని డిజాస్టర్ గా మార్చేశాయి . మరీ ముఖ్యంగా ఛార్మి హీరోయిన్ గా మంచి స్థానంలో ఉన్నప్పుడే ఐటం గర్ల్ గా మారి చిందులు వేయడంతో జనాలు ఆమెను దూరం పెట్టడానికి ట్రై చేశారు . ఆ తర్వాత ఇండస్ట్రీలో నుంచి ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది . ప్రజెంట్ నిర్మాతగా తన లక్ ని పరీక్షించుకున్న ఛార్మి త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలోనే చార్మి ఇండస్ట్రీలోకి ఏ ఏజ్ లో వచ్చింది అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కేవలం పద్నాలుగు అంటే 14 వయసులోనే ఛార్మి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందట . చదువుకుంటున్న వయసులోనే ఆఫర్ రావడంతో నో చెప్పలేక సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో మూవీస్ ని యాక్సెప్ట్ చేసిందట . అలా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఛార్మి సినిమాలపై ఉన్న మోజుతో చదువుని కూడా నెగ్లెట్ చేసింది అని జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news