MoviesNBK 108: తమన్నా తప్పించి అనసూయని బలవంతంగా లాక్కొచ్చింది ఎవరో తెలుసా...

NBK 108: తమన్నా తప్పించి అనసూయని బలవంతంగా లాక్కొచ్చింది ఎవరో తెలుసా .. లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేంజ్..!?

టాలీవుడ్ నట సిం హం గా ట్యాగ్ చేయించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ కంటెంట్ సినిమాలను యాక్సెప్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోలు కూడా అలాంటి ఓ క్రేజీ కథ ఉన్న సినిమాలను చూస్ చేసుకోలేకపోతున్నారు. క్లాస్ ఆడియన్స్ కి మాస్ ఆడియన్స్ కి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలాంటి కాంబో ని సెట్ చేస్తున్నాడు బాలయ్య . కాగా రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు .

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి ఎన్బికె 108 అనే #hash Tag తో షూటింగ్ జరుపుకుంటుంది . ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మెయిన్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలయ్య సరసన ఇద్దరి హీరోయిన్ లు నటిస్తున్నారు . ఒకరు శ్రేయ శరణ్.. మరొకరు కాజల్ అగర్వాల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం ఏకంగా తమన్నాని రంగంలోకి దించాడు అనిల్ రావిపూడి అంటూ ఓ న్యుస్ వైరల్ అయింది .

అయితే 24 గంటల నుంచి మరో న్యూస్ హల్చల్ చేస్తుంది. తమన్న ప్లేస్ లో యాంకర్ అనసూయ ను రంగంలోకి దించినట్లు అనిల్ రావిపూడి సినివర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. తమన్న ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతోనే తిక్కరేగిన అనిల్ రావిపూడి .. ఆమెను తీసేసి మరి అనసూయను చూస్ చేసుకున్నట్లు తెలుస్తోంది . గతంలో కూడా ఓ షో హోస్ట్ విషయంలో తమన్న ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాడ్ చేయడంతో ఆమెను తీసేసి యాంకర్ అనసూయ ని పెట్టుకున్నారు మేకర్స్. కాగా మరోసారి అనిల్ రావిపూడి సైతం తమన్నా ను తీసేసి అనసూయ అని పెట్టుకోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంటే అనసూయ తమన్నా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందనేగా అర్ధం అంటూ అనసూయ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news