Newsస‌మంత జ్ఞాప‌కాలు వ‌ద‌ల్లేక‌పోతోన్న చైతు… ఏం చేశాడో చూడండి..!

స‌మంత జ్ఞాప‌కాలు వ‌ద‌ల్లేక‌పోతోన్న చైతు… ఏం చేశాడో చూడండి..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్ర‌భు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కస్టడీ. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. అయితే నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత ప్రేమ వివాహం చేసుకొని నాలుగేళ్లపాటు కాపురం చేశాక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఎవరి దారుల్లో వారు జీవిస్తున్నారు. కస్టడీ సినిమా ప్రమోషన్లలో నాగచైతన్య పదేపదే సమంత టాపిక్ వచ్చేలా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనూ ఇదే హాట్‌ టాపిక్ గా మారింది. గతంలో సమంత పేరు ప్రస్తావనకు వస్తే ఏమాత్రం పట్టించుకోని నాగచైతన్య ఇప్పుడు పదేపదే సమంత పేరు వస్తున్నా స్పందిస్తున్నాడు. అలాగే సమంత పేరు కూడా తానే స్వయంగా తెరమీదకు తీస్తున్నాడు. అందుకు కారణం ఏంటని ? ఎవరికి వారు ఆరాలు తీస్తున్నారు.

ఇటీవల శాకుంత‌లం సినిమా ప్రమోషన్లలో నాగచైతన్య పై సమంత రకరకాల కామెంట్ చేసింది. తమ వివాహ బంధం ఫెయిల్ అవ్వటానికి తాను కారణం కానేకాదు.. అంటూ పరోక్షంగా నాగచైతన్యను తప్పుపట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా నాగచైతన్య వెళుతున్నాడు. సమంత చాలా మంచిది.. ఆమె తప్పేం లేదు కొన్ని కారణాలవల్ల మేము విడిపోవలసి వచ్చింది అన్నట్టుగా చెబుతున్నాడు.

కేవలం కస్టడీ సినిమా ప్రమోషన్ల కోసం.. కస్ట‌డీ సినిమా వార్తల్లో ఉండేందుకే నాగచైతన్య తరచూ సమంత పేరు ప్రస్తావనకు తీసుకు వస్తున్నాడు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే సమంత శకుంతలం సినిమా ప్రమోషన్ల కోసం నాగచైతన్య పేరు ఎంత ప్రస్తావన తెచ్చినా శాకుంతలం డిజాస్టర్ అయింది. ఇప్పుడు కస్టడీ సినిమా విషయంలోనూ కథలో దమ్ము లేకపోతే.. సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే ఎంత సమంత పేరు ఊదరగొట్టినా ఉపయోగం ఉండదని చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news