News' ఆదిపురుష్ ' మూవీకి రిలీజ్‌కు ముందే పెద్ద ఎదురు దెబ్బ‌…...

‘ ఆదిపురుష్ ‘ మూవీకి రిలీజ్‌కు ముందే పెద్ద ఎదురు దెబ్బ‌… ప్ర‌భాస్‌ను వాళ్లు బాగా టార్గెట్ చేశారు…!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ప్ర‌భాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథలాజిల్ మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఓం రౌత్ బాలీవుడ్‌లో తానాజీ లాంటి వైవిధ్య‌మైన సినిమాను తీసి సూప‌ర్ హిట్ కొట్టారు.

ఇక ఆదిపురుష్ సినిమాను రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్లు క‌లిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అజయ్, అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. సినిమాకు ముందు నుంచి ఎందుకో గాని నెగ‌టివ్ టాక్ ఎక్కువుగా న‌డుస్తోంది. టీజ‌ర్లు, స్టిల్స్ అన్నీ కూడా యానిమేష‌న్ మోడ‌ల్లో ఉన్నాయ‌నే ఎక్కువ కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశాక కొంత హైప్ క‌నిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా నటిస్తుండగా సీతగా కృతిసనన్, లంకేష్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది అనుకుంటోన్న టైంలోనే ఇప్పుడు ఆదిపురుష్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నార్త్‌లో కొన్ని వ‌ర్గాల వారు ఆదిపురుష్ సినిమాను బాయ్‌కాట్ చేయాల‌ని నినాదాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్రెండ్ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది.

ఆదిపురుష్ ట్రైలర్ రామాయణానికి దగ్గరగా లేదనిస… ట్రైల‌ర్‌లో హ‌నుమంతుడి పాత్ర‌ను కూడా ప‌లువురు ట్రోల్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తోంది. దీనికి తోడు గ‌త రెండు మూడేళ్లుగా బాలీవుడ్‌లో పెద్ద సినిమాల‌కు బాయ్‌కాట్ ట్రెండ్ కూడా న‌డుస్తోంది.

ఇప్పుడు నార్త్ సినిమా కావ‌డంతో ఆదిపురుష్‌ను, అక్క‌డ స్టార్ హీరోల‌కే షాకులు ఇస్తోన్న ప్ర‌భాస్‌ను కావాల‌నే ఇలా టార్గెట్ చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. అయితే ఈ సినిమా మేక‌ర్లు మాత్రం త‌మ కంటెంట్ స‌మాధానం చెపుతుంద‌ని.. ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news