Moviesప‌వ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ' ఖుషి ' సినిమాకు ముందు అనుకున్న 2...

ప‌వ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ ఖుషి ‘ సినిమాకు ముందు అనుకున్న 2 టైటిల్స్ ఇవే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్ల అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోస్ లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాకు ఎలాంటి హైప్ ఉంటుందో అందరికీ తెలుసు.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో 13 సినిమాల వరకు రీమిక్స్ సినిమాలు ఉండడం విశేషం. అయితే ప‌వ‌న్ చేసిన రీమేక్ సినిమాగా తెరకెక్కిన సినిమాల్లో ఖుషి సినిమా ఒకటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ లైఫ్ లో ఎప్ప‌ట‌కీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. త‌మిళ‌ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో భూమిక కథనాయకగా ఈ సినిమా తెరకెక్కింది.

శ్రీ సూర్య మూవీస్ గ్యానర్ పై ఏఎం. ర‌త్నం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే తమిళంలో ఈ సినిమా విజయ్ – జ్యోతిక జంటగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. రత్నం దగ్గర తమిళ్ హీరో విజయ్ డేట్స్ తో పాటు.. తెలుగు హీరో పవన్ కళ్యాణ్ డేట్లు కూడా ఉన్నాయి. అందుకే ఖుషి సినిమాను ముందుగా తమిళంలో తర్కెక్కించారు. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవడంతో.. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా రీమేక్‌ చేశారు.

2001 సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ముందు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత యూత్ కు పిచ్చపిచ్చగా నచ్చేయడంతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రోజుల్లోనే 79 కేంద్రాలలో 100 రోజులు ఆడి సంచలన విజయం నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా… ఖుషి ఎప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాను తెలుగులో తీస్తున్నప్పుడు ఖుషి కాకుండా మరో రెండు టైటిల్స్ పెట్టాలని అనుకున్నారు.

చెప్పాలని ఉంది అనే వర్కింగ్ టైటిల్‌ ముందు ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ తోనే చాలా రోజులు పాటు షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ముద్దు అనే పేరు కూడా పరిశీలించారు. చివరకు ఖుషి అనే పేరు ఖరారు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా తమిళంలో హీరోయిన్గా నటించిన జ్యోతికకు.. తెలుగులో హీరోయిన్గా నటించిన భూమికకు ఇద్దరికి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news