Newsఆ హీరోతో ప్రియాంక‌చోప్రాకు ఫ‌స్ట్ పెళ్ల‌య్యింది.. అది కూడా కెనడాలో… ఇన్నాళ్ల‌కు...

ఆ హీరోతో ప్రియాంక‌చోప్రాకు ఫ‌స్ట్ పెళ్ల‌య్యింది.. అది కూడా కెనడాలో… ఇన్నాళ్ల‌కు భ‌య‌ట‌ప‌డ్డ నిజం..!

ప్రియాంక చోప్రా ఒక‌ప్ప‌టి అందాల సుంద‌రి. ఇక బాలీవుడ్ ఇండ‌స్ట్రీని కొన్నేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన ప్రియాంక కొన్నేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. ఆ త‌ర్వాత ఆమె త‌న‌కంటే వ‌య‌స్సులో ప‌దేళ్లు చిన్నోడు అయిన నిక్‌తో ప్రేమ‌లో ప‌డి అత‌డిని పెళ్లి చేసుకుని హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. ఇక బాలీవుడ్ లో ఆమె ఓ స్టార్ హీరోతో ఎఫైర్ న‌డిపింద‌న్న‌ది వాస్త‌వం.

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రిలేషన్ షిప్ అన్న‌ది అప్ప‌ట్లో బాలీవుడ్‌లో ఓపెన్ సీక్రెట్‌. వీరిద్ద‌రు కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశార‌న్న‌ది వాస్త‌వం. అయితే వీరి ఎఫైర్‌కు చెక్ పెట్టాల‌నే షారుక్ భార్య గౌరి.. త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి.. క‌ర‌ణ్ జోహార్‌తో చేతులు క‌లిపి ప్రియాంకకు అవ‌కాశాలు లేకుండా చేసింద‌న్న వాద‌న‌లు కూడా ఉన్నాయి.

అయితే వీరిద్ద‌రి కెరీర్‌కు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్ కూడా అప్ప‌ట్లో ఉండేది. షారుక్ ప్రియాంకను టొరంటోలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడనే రూమర్లు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ హాలీవుడ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో షారుక్‌తో త‌న ఎఫైర్ గురించి ప‌రోక్షంగా ఓపెన్ అయ్యింది. సిటాడెల్ ప్ర‌మోష‌న్లో ఆమె వేసుకున్న జాకెట్ బాగుంద‌ని యాంక‌ర్ అడిగారు.

వెంట‌నే ప్రియాంక ఈ జాకెట్ నాకు చాలా స్పెష‌ల్‌.. ఇది నా ఎక్స్ భాయ్‌ఫ్రెండ్ ఇచ్చాడు. అత‌డు నానుంచి వెళ్లిపోయినా.. ఈ జాకెట్ మాత్రం నా ద‌గ్గ‌రే ఉంచుకున్నాన‌ని చెప్పింది. ప్రియాంక అలా చెప్పిందో లేదో వెంట‌నే గ‌తంలో షారుక్ ఆ జాకెట్ వేసుకున్న స్టిల్స్ సోష‌ల్ మీడియాలో పిచ్చ‌పిచ్చ‌గా వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఆ యాంక‌ర్ ఇప్ప‌ట‌కీ అత‌డు ట‌చ్‌లో ఉన్నాడా ? అని ప్ర‌శ్నిస్తే ట‌చ్‌లో ఉంటే బాగుండును అనే అర్థంలో ప్రియాంక కామెంట్ చేసింది. ప్రియాంక ఇచ్చిన కామెంట్స్‌తో ఆమె – షారుక్ ఎఫైర్‌తో పాటు వారిద్ద‌రి సీక్రెట్ పెళ్లి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news