Moviesఅప్పుడు అలా ..ఇప్పుడు ఇలా.. కృతిశెట్టి తెలివి తెల్లారిన్నట్లే ఉందిగా..!?

అప్పుడు అలా ..ఇప్పుడు ఇలా.. కృతిశెట్టి తెలివి తెల్లారిన్నట్లే ఉందిగా..!?

టాలీవుడ్ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుందా ..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మొదటి నుంచి చాలా బోల్డ్ గా మెచ్యూర్డ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే కృతశెట్టి .. వరుసగా మూడు ఫ్లాపులు పడేసరికి రూట్ మార్చేసిందని.. ఈ క్రమంలోనే అమ్మడు సోషల్ మీడియాలో తన పేరు ని జనాలు మర్చిపోకుండా ఉండేలా రోజు రోజుకి బోల్డ్ ఫోటోషూట్ చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ అయి హిట్ అవ్వగానే.. బాలీవుడ్ లో రీమిక్ చేయాలి అని అనుకున్నప్పుడు.. కృతి శెట్టిని హీరోయిన్గా అప్రోచ్ అయ్యారట. ఇదే విషయాన్ని అఫీషియల్ గా చెప్పుకొచ్చింది కృతి శెట్టీ. అయితే “నేను బాలీవుడ్ ఇండస్ట్రీలో చేయనని .. టాలీవుడ్ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది అని .. నాకు ఇక్కడి నుంచి లైఫ్ వచ్చిందని ..నా లైఫ్ టాలీవుడ్ కి అంకితం చేస్తున్నానని “..భారీ భారీ డైలాగులు చెప్పింది .

సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ బాలీవుడ్లో అవకాశాల కోసం కృతిశెట్టి నానాదంటాలు పడుతుందట . ఈ క్రమంలోనే ఎలాగోలా ఒక ఆఫర్లు పట్టిందని.. అది కూడా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అని అది కూడా కేవలం అరగంట కూడా లేని పాత్ర కోసం కృతి శెట్టి ఓకే చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు. ఎలాగైనా సరే బాలీవుడ్లో కాళ్ళు పెట్టడానికి ఇలాంటి ఆఫర్ ను దక్కించుకుందట . అయితే కృతి శెట్టి బురిడీ కొట్టింది అంటున్నారు జనాలు . వెళ్లిన వరకు హీరోయిన్గా వెళ్తే సక్సెస్ అవుతారు.. కానీ సెకండ్ హీరోయిన్గా ఏం ప్రయోజనం ఉంటుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news