Moviesత్రివిక్ర‌మ్ ఇంట్లో మ‌రో ద‌ర్శ‌కుడూ ఉన్నాడా… ఎవ‌రా డైరెక్ట‌ర్ ..!

త్రివిక్ర‌మ్ ఇంట్లో మ‌రో ద‌ర్శ‌కుడూ ఉన్నాడా… ఎవ‌రా డైరెక్ట‌ర్ ..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టార్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క సినిమా అయినా చేయాల‌ని ఎందరో హీరోలు కాచుకుని ఉన్నారు. మ‌హేష్‌బాబుతో అల వైకుంఠ‌పురంలో లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ మూడేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబుతో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఇంట్లోనే మ‌రో డైరెక్ట‌ర్ కూడా ఉన్న విష‌యం లీక్ అయ్యింది. అదేంటి త్రివిక్ర‌మ్ ఇంట్లో మ‌రో డైరెక్ట‌ర్ ఎవ‌ర‌బ్బా ? అని మ‌నం బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టుకునేలా ఆలోచ‌న చేస్తాం. త్రివిక్ర‌మ్ త‌న భార్య సౌజ‌న్య‌ను ఇప్ప‌టికే నిర్మాత‌ను చేసేశారు. సార్‌, బుట్ట‌బొమ్మ సినిమాల‌కు ఆమె నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇక త్రివిక్ర‌మ్ ఇంట్లో ఉన్న మ‌రో డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. ఆయ‌న కుమారుడు కావ‌డం విశేషం. త్రివిక్ర‌మ్‌కు చాలా ఎర్లీ ఏజ్‌లోనే పెళ్ల‌య్యింది. ఇప్పుడు ఆయ‌న ఇద్ద‌రు కుమారులు పెద్ద‌వాళ్లే. వీరిలో ఒక‌రు గ్రాడ్యుయేష‌న్ చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు కొడుకుల్లో ఒక‌రికి డైరెక్ష‌న్‌పై మంచి ఆస‌క్తి ఉంద‌ట‌. ఏ సీన్ ఎలా ఉంది ? కెమేరా యాంగిల్ ఏంటి ?? ఏ లెన్స్ వాడారు ? ఇలా ప్ర‌తి ఒక్క దాంట్లో మంచి గ్రిప్ ఉంద‌ని త్రివిక్ర‌మ్ భార్య చెపుతున్నారు.

ఇప్ప‌టికే డైరెక్ష‌న్ విష‌యాల‌లో తండ్రి ద‌గ్గ‌ర నుంచి ఓన‌మాలు నేర్చుకుంటోన్న త్రివిక్ర‌మ్ కొడుకు భ‌విష్య‌త్తులో డైరెక్ట‌ర్‌గా మార‌డ‌మే త‌రువాయి. మ‌నోడు తండ్రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తే చాలు.. అదే అనుభ‌వంతో భ‌విష్య‌త్తులో డైరెక్ట‌ర్ అవ్వ‌డం పెద్ద క‌ష్టం కాదు. త్రివిక్ర‌మ్ కూడా త‌న కొడుకును డైరెక్ట‌ర్ చేసేందుకు ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్న‌ట్టే ఆయ‌న భార్య‌ల మాట‌లు చెప్ప‌క‌నే చెపుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news