Moviesన‌య‌న‌తార పిల్ల‌ల పేర్లు ఇవే… వావ్ పాన్ ఇండియా స్టైల్లో…!

న‌య‌న‌తార పిల్ల‌ల పేర్లు ఇవే… వావ్ పాన్ ఇండియా స్టైల్లో…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివ‌న్‌ గత ఏడాది జూన్లో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఇక అక్టోబర్లో సరోగసి విధానం ద్వారా తాము తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. నయనతార 15 సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా కొనసాగుతోంది. కేర‌ళ‌లో ఓ టీవీ షోలో యాంక‌ర్‌గా చేసుకుని అమ్మాయి ఈ రోజు దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉంది.

న‌య‌న‌తార ప్రేమ‌లతో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండేది. శింబు, ప్ర‌భుదేవా, ఆర్య‌తో ఆమె ప్రేమాయ‌ణాలు న‌డిపింది. ఎట్ట‌కేల‌కు విఘ్నేష్ శివ‌న్‌కు భార్య‌గా ఓ ఇల్లాలు అయ్యింది. పెళ్లి అయ్యాక కూడా నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు ఐదు కోట్లకు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తుంది. ఇక వయసులో తనకంటే ఏడాది చిన్నోడు అయినా విగ్నేష్ శివ‌న్‌ ప్రేమలో పడి అతడిని భర్తగా స్వీకరించింది.

ఇక న‌య‌న్ దంపతులు సరోగసి విధానంతో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఈ ఇంట్లో నయనతార తన ఇద్దరు కుమారుల పేర్లను కూడా రివీల్ చేసింది. తన కవల పిల్లలకు పేర్లు కూడా పెట్టింది. అయితే పేర్లు రివీల్ చేసినా ముఖాలు క‌న‌ప‌డ‌నీయ‌లేదు. తన మొదటి కుమారుడి పేరు ఉయర్ రుద్రోనిల్ ఎన్ శివన్ అని.. రెండవ కుమారుడి పేరు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్ అంటూ చెప్పేసింది. చాలామంది నెటిజ‌న్లు ఈ పేర్లు పాన్ ఇండియా లెవ‌ల్లో ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news