Moviesప్రభాస్ చేత బలవంతంగా ఆ పని చేయించారా..? ఏంటి స్టార్స్ సెలబ్రిటీస్...

ప్రభాస్ చేత బలవంతంగా ఆ పని చేయించారా..? ఏంటి స్టార్స్ సెలబ్రిటీస్ ఇలా కూడా చేస్తున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా దసరా. న్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. అంతేకాదు నాని కెరియర్ లోనే ఇప్పటివరకు అత్యధిక కలెక్షను సాధించిన మూవీగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా నాని దసరాను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు.

మరీ ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ..నాని దసరా సినిమాని ఏ రేంజ్ లో పొగిడేసారో మనందరికీ బాగా తెలిసిందే. కాగా రీసెంట్గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం నాని దసరా మూవీ ని పొగుడు తూ ట్వీట్ చేశారు . ఈ క్రమంలోనే నాని దసరా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నాని దసరా సినిమాను కావాలనే స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారని .. నాని అంటే మొదటి నుంచి ఇష్టం గల ఓ బడా ప్రొడ్యూసర్ తనకి టచ్ లో ఉన్న బడా హీరోలతో కాల్ చేసి మరీ దసరా సినిమాపై ట్వీట్ చేయమంటూ దసరా సినిమాని పొగడమంటూ హెల్ప్ చేయమని అడిగారని ..ఆ కారణంగానే స్టార్స్ ఈ విధంగా దసరా సినిమాను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో నాని దసరా సినిమా నీ హైప్ చేయడానికి ఇంతమంది స్టార్స్ ప్రయత్నిస్తున్నారా? స్టార్స్ ఇలా కూడా తమ కోస్టార్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . గతంలో కూడా నాని ని ఆ బడా ప్రొడ్యూసర్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు నానిని రిపోర్టర్ కాంట్రవర్షీయల్ ప్రశ్న నుంచి కాపాడిన విషయం అందరికీ తెలిసిందే. నాని దసరా సినిమా హిట్ కొట్టినా సరే ఇలాంటి కామెంట్స్ ఆయనను బాధపెట్టే విధంగా ఉన్నాయి అంటున్నారు నాని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news