MoviesNBK108: బాల‌య్య సినిమాపై రెండు ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్లు వ‌చ్చేశాయ్‌..

NBK108: బాల‌య్య సినిమాపై రెండు ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్లు వ‌చ్చేశాయ్‌..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బ‌స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. బాలయ్యకి జోడిగా శృతిహాసన్ నటించిన ఈ సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. బాలయ్య ప్రస్తుతం అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లోనే మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. అనిల్ రావిపూడి స్టైల్ కు భిన్నంగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో వీటిని షూట్ చేస్తున్నారు. హైదరాబాదులో జరిగే షెడ్యూల్ దాదాపు రెండు వారాలపాటు జరగనుంది.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీల కీలక పాత్రలో కనిపించనుంది. ఇక బాలయ్యను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఇక తనదైన మార్క్ టైమింగ్ తో.. తన మార్కు డైలాగులతో బాలయ్య ఈ సినిమాలో అదరగొట్టేస్తాడని తెలుస్తోంది.

ఇటు వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగ‌స్టు లేదా ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య కచ్చితంగా వరుసగా మూడో విజయం తన ఖాతాలో వేసుకుంటాడు అన్న అంచనాలు టాలీవుడ్ లో బలంగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news