Moviesటాలీవుడ్‌ను షేక్ చేసే న్యూస్‌.. ఎన్టీఆర్ - మ‌హేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌... ద‌ర్శ‌కుడు...

టాలీవుడ్‌ను షేక్ చేసే న్యూస్‌.. ఎన్టీఆర్ – మ‌హేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌… ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..?

ఇది నిజంగా టాలీవుడ్‌ను షేక్ చేసే న్యూస్ అని చెప్పాలి. టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న దర్శకుడు రాజమౌళి ఒక్కడే అని ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లోనే రెండు పెద్ద కాంపౌండ్లకు చెందిన హీరోలుగా ఉన్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు.

నిజంగా రాజమౌళి ఎంతో గట్స్ ఉన్న డైరెక్టర్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా నేప‌థ్యంలో ఈ సినిమా సాగనుంది.

అయితే ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్టీఆర్ పాత్ర మహేష్ బాబుకు ఈక్వల్ గా ఉంటుందా ? లేదా కొన్ని సీన్ల‌కే పరిమితమై ఉంటుందా ? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉంటే కచ్చితంగా సినిమా రేంజ్ వేరేగా ఉంటుంది.

ఏది ఏమైనా ఎన్టీఆర్ తో వరుసగా రెండు మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త సంచలనం క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news